జలపాతంలో పడి టెక్కీ మృతి, ఔటర్ ప్రమాదంలో ఐఐటీ విద్యార్థి

ఔటర్‌లో ఐఐటీ విద్యార్థి మృతి
ఔంటర్ రింగ్ రోడ్డులో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మేడ్చల్ పరిధిలోని ఓటర్ రింగ్ రోడ్డు పైన ఓ కారు డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టడంతో కారులో ఉన్న ఐఐటీ విద్యార్థి సీహెచ్ రామలింగ రాజు మరణించారు. శామీర్ పేట మండలం తూంకుంట వాసి అయిన రామలింగ రాజు మద్రాస్ ఐఐటీలో ఫైనలియర్ చదువుతున్నాడు.
సెలవుల్లో ఇక్కడకు వచ్చిన రాజు శనివారం కారులో శామీర్ పేట నుండి మేడ్చల్ వస్తూ మునిరాబాద్ పరిధిలో ముందు వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టాడు. అతని వయస్సు 23.
మోసగించిన కేసులో ఐదుగురి అరెస్ట్
సౌదీ రియాళ్లు ఇస్తామని మోసగించిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, శనివారం నాడు రిమాండుకు తరలించారు. కంచన్ బాగ్‌కు చెందిన మహ్మద్ నసీరుద్దీన్ అమీర్ పేటలోని గురుద్వార వద్ద ప్లాస్టిక్ సామాగ్రిని విక్రయిస్తుంటాడు. ఈ నెల 14వ తేదీన పశ్చిమ బెంగాల్‌కు చెందిన రషీదా బేగం సామాగ్రిని కొనుగోలు చేసింది.
అతనితో మాటలు కలిపి తన ఫోన్ నెంబర్ ఇచ్చింది. సౌదీకి చెందిన ఒక రియాల్ నోటు ఇచ్చి చలామణి చేసి ఇవ్వాలని కోరింది. దానిని మార్చగా రూ.1600 వచ్చింది. ఆ డబ్బు తీసుకొనేందుకు హుస్సేన్ అనే వ్యక్తితో కలిసి నసీరుద్దీన్ వద్దకు వచ్చిన ఆమె అతడిని అన్నగా పరిచయం చేసింది.
డబ్బు తీసుకొని రూ.4 వందలు ఇచ్చింది. తన వద్ద మరో 300 రియాళ్లు ఉన్నాయని, వాటిని మారిస్తే కమీషన్ ఇస్తానని తెలిపింది. ఆశపడ్డ నసీరుద్దీన్ రూ.3 లక్షలు ఇచ్చి 600 రియాళ్ల నోట్లు తీసుకున్నాడు. తర్వాత వాటిని చూసి మోసపోయానని గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రషీదా బేగం, ఫర్వీన్ బేగం, హుస్సేన్, బిలాల్, జాషిన్‌లను అరెస్టు చేశారు.
-
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..! -
చందమామకు అవతలి వైపు అద్భుతం- సంపూర్ణ సూర్యగ్రహణం












Click it and Unblock the Notifications