చెట్టును ఢీకొట్టిన కారు: ఇద్దరు టెక్కీల దుర్మరణం

అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
మృతులను సుదీప్, ఇట్యాగాలుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో వారిద్దరు ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం వారి మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications