టెక్నో ఫెస్ట్: విద్యార్థినీ, విద్యార్థుల నృత్యాలు (పిక్చర్స్)
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్న టెక్నో ఉస్మానియా-2014 ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. వేడుకల్లో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులు చేసిన డ్యాన్సులు, పాటలు, లఘు చిత్రాల ప్రదర్శన, నాటకాలు అలరించాయి.
కార్యక్రమం ముగింపు సందర్భంగా విద్యార్థులంతా కలిసి చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా పలు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింతా సాయిలు, కన్వీనర్ ప్రొఫెసర్ శ్యామ్‌సుందర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్, ప్రొఫెసర్లు కెఎస్‌కె రావు పట్నాయక్, హయవదన, కవితా వాఘ్రే, పరశురామ్ పాల్గొన్నారు.

విద్యార్థినుల సందడి
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్న టెక్నో ఉస్మానియా-2014 ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి.

విద్యార్థినుల నృత్యాలు
వేడుకల్లో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులు చేసిన డ్యాన్సులు, పాటలు, లఘు చిత్రాల ప్రదర్శన, నాటకాలు అలరించాయి.

విద్యార్థినుల సందడి
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్న టెక్నో ఉస్మానియా-2014 ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్న యువతులు.

యువకుల సందడి
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్న టెక్నో ఉస్మానియా-2014 ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్న యువకులు.

విద్యార్థినుల కేరింతలు
టెక్నో వేడుకల ముగింపు సందర్భంగా విద్యార్థులంతా కలిసి చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.












Click it and Unblock the Notifications