కిరణ్ కొనసాగింపు, ప్యాకేజీ: కాంగ్‌పై బిజెపి అనుమానం

కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకున్నప్పటికీ విధాన నిర్ణయంగా తాము మాత్రం తెలంగాణకు మద్దతు తెలుపుతామని, సీమాంధ్రకు అన్యాయం జరగకుండా చూస్తామని తమను కలుస్తున్న సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల నాయకులకు చెబుతున్నారు. జివోఎంకు నివేదిక ఇచ్చే విషయంపై పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే విభజన బిల్లుకు సవరణ తీర్మానం ఇచ్చి అయినా సరే తెలంగాణ, సీమాంధ్ర ప్రయోజనాలను తాము పరిరక్షిస్తామని వారు విశ్వాసం కల్పిస్తున్నారు.
రాజధానిపై చర్చ
అదే సమయంలో విభజనపై నిర్ణయం జరిగిన నేపథ్యంలో కాంగ్రెసు ఆ దిశగా వెళ్తే కొత్త రాజధాని ఎక్కడైతే బాగుంటుందనే చర్చ బిజెపిలో అంతర్గతంగా జరుగుతోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర నేతలు అగ్రనేతలతో విజయవాడ-గుంటూరు, విశాఖపట్నం నగరాలు రాజధానికి అనుకూలంగా ఉంటాయని కొందరు చెప్పినట్లుగా తెలుస్తోంది. రాజధాని పైన అగ్రనేతల సమక్షంలో చర్చ సాగిందని తెలుస్తోంది.
అయితే రాయలసీమ నేతలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. ఆంధ్ర ప్రదేశ్ కోసం కర్నూలులో ఉన్న రాజధానిని తాము త్యాగం చేశామని, విభజన తర్వాత కొత్త రాజధానిని కర్నూలులోనే ఏర్పాటు చేస్తే వెనుకబడిన తమ ప్రాంతానికి కొంతైనా న్యాయం చేసినట్లవుతుందని వారు చెప్పారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications