పదిమంది కిరణ్‌లు వచ్చినా టి ఆపలేరు: టి ఎమ్మెల్సీలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలాంటి వారు మరో పదిమంది వచ్చినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు ఆమోస్ మంగళవారం అన్నారు. విభజనలో ఏ లొసుగులు పెట్టినా యుద్ధమే అని హెచ్చరించారు. విభజనపై కుతంత్రాలు చేస్తే అదే వాళ్లకు చివరి రోజు అవుతుందన్నారు.
తెలంగాణ ప్రాంత మంత్రులది ముసుగులో గుద్దులాట అని మరో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేయాల్సింది పోయి బతిమాలడమేమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రోరోగ్ చేసేది లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఫైల్ పైన రాయాలని సూచించారు. తెలంగాణపై ముఖ్యమంత్రి కపట ప్రేమలు వద్దని, తమ బాధలేవో తాము పడతామన్నారు.

అసెంబ్లీ ప్రోరోగ్ కాకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రాంత మంత్రుల పైనే ఉందన్నారు. ఐబి ఆపరేషన్ రహస్యంగా ఉంటుంది కాబట్టి ఫోన్లు ఎవరు చేస్తున్నారో బయటపెట్టాలన్నారు. కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కిరణ్‌ను టి మంత్రులు డిమాండ్ చేయాలన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన వెనుక సీమాంధ్ర నేతల హస్తముందని ఆరోపించారు. కిరణ్ భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకోవాల్సిందే అన్నారు.
ఆగ్రహానికి గురికాక తప్పదు: టి గెజిటెడ్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమైతే ఆగ్రహానికి గురికాక తప్పదని తెలంగాణ గెజిటెడ్ సంఘం హెచ్చరించింది. మహిళా ఉద్యోగులు పని చేసే చాంబర్లు పారదర్శకంగా ఉండేలా చూడాలని కోరారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications