KCR ఏపీ పర్యటన ఖరారు?
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత ఆ పార్టీ అధినేత తొలి ప్రాధాన్యం ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత చివరిసారిగా ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో పాల్గొని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అదే ఆయన చివరి పర్యటన. బీఆర్ఎస్ ఏర్పాటుతో మరోసారి ఆయన ఏపీ పర్యటన ఖరారవుతోందని ప్రగతి భవన్ వర్గాలు వెల్లడించాయి.

విశాఖలోకానీ, విజయనగరంలోకానీ..
విజయనగరంలోకానీ, విశాఖపట్నంలో కానీ పార్టీ తరఫున బహిరంగసభను ఏర్పాటు చేయబోతున్నారు. సామాజికవర్గాలను ఆధారంగా చేసుకొని ఆయన పర్యటించబోతున్నారు. ఉత్తరాంధ్రలో అయితే తన సామాజికవర్గ నేతలున్నారు.. సభకు భారీగా తరలివస్తారనే అంచనాతో తొలి సభను అక్కడ ఏర్పాటు చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడుస్తున్న రోజుల్లో సీమాంధ్రులను అసభ్య పదజాలంతో దూషించారు. అప్పుడు గాయపడ్డ ఆంధ్రుల మనోభావాలు ఇప్పటికీ తగ్గలేదు. ఈ విషయం కేసీఆర్ కు కూడా బాగా తెలుసు. ఏపీకి వచ్చి ఏం చెప్పబోతున్నారు? వ్యతిరేకతను తనకు ఎలా అనుకూలంగా మలచుకోబోతున్నారు? ఆయన వ్యూహం ఏమిటి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి.

అమరావతి ఒకవైపు.. విశాఖపట్నం మరోవైపు..
ఉత్తరాంధ్ర విషయంలో ఏపీ అట్టుడికినట్లు ఉడుకుతోంది. ఒకవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా విశాఖపట్నంలో మూడు రాజధానులకు అనుకూలంగా సభ జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న రైతుల పాదయాత్రలో దారిపొడవునా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ప్రయివేటు పరం చేయబోతున్నామని కేంద్రం ప్రకటించింది. ఉద్యోగులు నిరాహారదీక్షలు చేస్తున్నారు. వైసీపీకానీ, టీడీపీకానీ కేంద్రాన్ని వ్యతిరేకించలేని పరిస్థితుల్లో ఉన్నాయి.

అసమ్మతి నేతలతో బీఆర్ఎస్ రాజకీయం?
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలుండటంతోపాటు పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన వివాదాలన్నీ 8 సంవత్సరాలుగా అలాగే కొనసాగుతున్నాయి. వీటి పరిష్కారానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడంలేదు. వీటిపై కేసీఆర్ ఏం సమాధానం చెప్పబోతున్నారనే సందేహం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పోలవరం ప్రాజెక్టు, చివరి నిముషంలో ఏపీలో కలిసిన 7 ముంపు మండలాలు, ఉద్యోగ నియామకాలు.. ఇలా ఏపీ చుట్టూ అనేక సమస్యలు తిష్టవేసివున్నాయి.
జాతీయపార్టీ నేతగా ఇక్కడకు వచ్చినప్పుడు వీటిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. వీటన్నింటినీ మించి మూడు రాజధానులు ఒకవైపు, అమరావతి మరోవైపుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. అమరావతికి మద్దతిస్తున్నారా? మూడు రాజధానులకు మద్దతిస్తున్నారా? అనే విషయంలో కేసీఆర్ ఒక స్పష్టత ఇస్తేనే ఇప్పటికిప్పుడు మద్దతివ్వకపోయినా ఆయనవైపు ప్రజలు ఒకసారిచూసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా టీడీపీ, వైసీపీల్లో సీట్లురానివారిని బీఆర్ ఎస్ లో చేర్చుకొని రాజకీయం చేద్దామంటే నడిచే రోజులు కావు. ఏదేమైనప్పటికీ కేసీఆర్ వ్యూహం బయటకు వస్తేనే ఈ అంశాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనపడుతోంది.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications