ముందే విజయమ్మకు టి సెగ: వైయస్ విగ్రహాల ధ్వంసం

నేరేడుచర్ల మండలం ఎల్బీనగర్, దొండపాడులలో గుర్తు తెలియని వ్యక్తులు వైయస్ విగ్రహాలను ధ్వంసం చేశారు. కోదాడలో విగ్రహానికి నిప్పు అంటించారు. కాగా, విజయమ్మ గురువారం వైయస్ విజయమ్మ గురువారం నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఆమె పర్యటనలో ప్రజలు నిరసన వ్యక్తం చేయాలని మంత్రి జానా రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో ఆ పార్టీ నాయకుల పర్యటనలను అడ్డుకోవాలన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అసెంబ్లీలో ప్రభుత్వ విప్ అనిల్‌కుమార్, ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ప్రజలకు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ జిల్లాల్లో విజయమ్మ పర్యటన కుట్ర పూరితమైందని, తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఆగిపోతే ఓట్లు, సీట్లు సంపాదించుకునేందుకే విజయమ్మ తెలంగాణలో పర్యటించాలనుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని నాడు ఇడుపులపాయలో వైస్ సమాధి వద్ద చేసిన ప్రమాణం ఏమైందని ప్రశ్నించారు.
అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రానికి లేఖ రాయలేదా? అని వారు ప్రశ్నించారు. తెలంగాణ కావాలని ప్రజలు కోరుకుంటుంటే సమైక్యం ఏలా సాధిస్తారని ప్రశ్నించారు. వర్షాలు, వరద బాధితులను పరామర్శించే నెపంతో విజయమ్మ చేయనున్న పర్యటనకు ప్రజలు అడుగడుగునా నిరసనలు తెలియజేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications