విడాకులివ్వను: రమ్య... రివాల్వర్ కావాలి: నరేష్
కరోనా తర్వాత అంతగా ట్రెండ్ అయిన విషయం ఏదన్నా ఉందా? అంటే కచ్చితంగా నరేష్-పవిత్రా లోకేష్ విషయమని చెప్పవచ్చు. అతని వ్యక్తిగత జీవితం గురించి, చేసుకున్న పెళ్లిళ్ల గురించి, పవిత్రా లోకేష్ తో డేటింగ్ గురించి ప్రతి అంశం విపరీతంగా వైరలైంది. తాజాగా నరేష్ కు సంబంధించిన మరో విషయం వార్తలకెక్కింది. తనకు ప్రాణహాని ఉందని, తుపాకి లైసెన్స్ కోసం అనుమతివ్వాలంటూ ఆయన ఎస్పీ మాధవరెడ్డిని కలిశారు.
నక్సల్స్ హిట్ లిస్టులో ఉండడంతో తనకు 2008లో తుపాకీ లైసెన్సు మంజూరు చేశారని, ఇప్పుడు కూడా తనకు ప్రాణ హాని ఉన్నందున ఆ తుపాకీ లైసెన్స్ ను పునరుద్ధరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు నరేష్. తనకు ప్రాణహాని ఉందని నరేష్ గతంలో కూడా చెప్పారు. తన మూడో భార్య రమ్య రఘుపతి వల్ల తన ప్రాణానికి రక్షణ లేదని గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఇదే విషయం మరోసారి హైలైటవడం చర్చకు దారితీసింది.

రమ్యరఘుపతి వల్ల వల్ల నరకయాతన అనుభవించానని, సుపారీ గ్యాంగ్ తో కలిసి ఆమె తనను చంపే ప్రయత్నం చేస్తోందని నరేష్ అంటున్నారు. ఆ భయంతోనే తాను బయటకు కూడా ఎక్కడికీ వెళ్లడంలేదన్నారు. తనను వదిలించుకోవడానికి నరేష్ ఎన్నో ప్రయత్నాలు చేశాడని, కృష్ణ గారి గౌరవ మర్యాదలు దెబ్బ తింటాయనే ఉద్దేశంతోనే మౌనంగా ఉన్నానని రమ్య రఘుపతి అంటోంది. నరేష్ కి విడాకులిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది. కొద్ది నెలలుగా నరేష్, పవిత్రా లోకేష్ సహజీవనం చేస్తున్నారు. తాము వివాహానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అలాగే మైసూరు లోని హోటల్ గదిలో వీరిద్దరూ ఉండగా రమ్య వారిని పట్టుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి వీరికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా చర్చల్లో ఉంటోంది.












Click it and Unblock the Notifications