నదిలో ఈతకు వెళ్లి: అమెరికాలో ప్రకాశం జిల్లా తెలుగు విద్యార్థి మృతి
ఒంగోలు: అమెరికాలో తెలుగు విద్యార్థి నదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాలకు చెందిన బాలసురేంద్ర కుమార్ (25) ఎంఎస్ చదివేందుకు టెక్సాస్ వెళ్లాడు.
గత నెల 22వ తేదీన అతను టెక్సాస్ వెల్లాడు. స్నేహితులతో కలిసి నదిలో ఈతకు వెళ్లాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ నదిలో మునిగి మృతి చెందాడు. ఈ విషయం తెలిసి బాలసురేంద్ర కుమార్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బాల సురేంద్ర తండ్రి రమేష్ పేరాలలో కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బాల సురేంద్ర తంజావూరులోని కాలేజీలో బిటెక్ చదివాడు.
క్యాంపస్ సెలక్షన్ ద్వారా టిసిఎస్‌లో ఉద్యోగం సంపాదించాడు. చెన్నైలో మూడు సంవత్సరాలు పని చేశాడు. బాల సురేంద్ర రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో ఫోన్లో చివరిసారిగా మాట్లాడాడు. బాలసురేంద్ర కుటుంబ సభ్యులకు ఆదివారం ఉదయం ఫోన్ ద్వారా విషయం తెలిసింది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications