విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రో కబడ్డీ: తెలుగు టైటాన్స్ లోగో ఆవిష్కరణ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ప్రో కబడ్డీ లీగ్(పికెఎల్)లో తలపడే వైజాగ్ జట్టు తెలుగు టైటాన్స్ లోగోను శుక్రవారం విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ కృష్ణబాబు ఆవిష్కరించారు. జులై 26 నుంచి ఆగస్టు 31 వరకు ఈ పోటీలు పలు వేదికల్లో జరుగున్నాయి. ఐపిఎల్ తరహాలో ఎనిమిది జట్లు ఈ లీగ్‌లో తలపడనున్నాయి. విశాఖపట్నం తరపున తెలుగు టైటాన్స్‌గా తలపడే జట్టుకు రాజగురు సుబ్రహ్మణ్యం నాయకత్వం వహిస్తున్నాడు.

జట్టులో తొమ్మిది మంది భారతీయ ఆటగాళ్లు ఉండగా, మరో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు జట్టు తరపున ఆడనున్నారు. ఈ జట్టుకు ఉదయ్ కుమార్, జగన్మోహన్‌లు శిక్షణనివ్వనుండగా.. మురళీధరన్, ఓంకార్‌లు సహకారం అందిస్తారు. తెలుగు టైటాన్స్ జట్టుకు శిక్షణ ఇస్తున్న ఉదయ్ కుమార్ భారత జట్టు జాతీయ కోచ్‌గా వ్యవహరించారు. ఇది ఇలా ఉండగా శుక్రవారం నాడే జట్టును అధికారికంగా ప్రకటించారు.

జట్టు ఫ్రాంఛైజీలైన శ్రీని శ్రీరామనేని, మహేష్ కొల్లి, గౌతమ్ నేదురుమల్లిలు పారిశ్రామికవేత్తలే కాక చక్కటి క్రీడాభిరుచి ఉంది. జులై 26 ఈ లీగ్ మ్యాచులు ప్రారంభం కానుండగా, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో క్రీడాభిమానులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. తెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్, ఢిల్లీ డైనమోస్, యు ముంబ, పునేరి పాల్టస్, జైపూర్ పింక్ పాంథర్స్, పాట్రా పైరేట్స్, బెంగళూరు బుల్స్ జట్లు ఈ లోగ్‌లో తలపడనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రో కబడ్డీ లీగ్ నిర్వాహకులు చారుశర్మ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.

తెలుగు టైటాన్స్

తెలుగు టైటాన్స్

ప్రో కబడ్డీ లీగ్(పికెఎల్)లో తలపడే వైజాగ్ జట్టు తెలుగు టైటాన్స్ లోగోను శుక్రవారం విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ కృష్ణబాబు ఆవిష్కరించారు.

తెలుగు టైటాన్స్

తెలుగు టైటాన్స్

జులై 26 నుంచి ఆగస్టు 31 వరకు ఈ పోటీలు పలు వేదికల్లో జరుగున్నాయి. ఐపిఎల్ తరహాలో ఎనిమిది జట్లు ఈ లీగ్‌లో తలపడనున్నాయి.

తెలుగు టైటాన్స్

తెలుగు టైటాన్స్

విశాఖపట్నం తరపున తెలుగు టైటాన్స్‌గా తలపడే జట్టుకు రాజగురు సుబ్రహ్మణ్యం నాయకత్వం వహిస్తున్నాడు.

తెలుగు టైటాన్స్

తెలుగు టైటాన్స్

జట్టులో తొమ్మిది మంది భారతీయ ఆటగాళ్లు ఉండగా, మరో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు జట్టు తరపున ఆడనున్నారు.

తెలుగు టైటాన్స్

తెలుగు టైటాన్స్

ఈ జట్టుకు ఉదయ్ కుమార్, జగన్మోహన్‌లు శిక్షణనివ్వనుండగా.. మురళీధరన్, ఓంకార్‌లు సహకారం అందిస్తారు. తెలుగు టైటాన్స్ జట్టుకు శిక్షణ ఇస్తున్న ఉదయ్ కుమార్ భారత జట్టు జాతీయ కోచ్‌గా వ్యవహరించారు.

తెలుగు టైటాన్స్

తెలుగు టైటాన్స్

జట్టు ఫ్రాంఛైజీలైన శ్రీని శ్రీరామనేని, మహేష్ కొల్లి, గౌతమ్ నేదురుమల్లిలు పారిశ్రామికవేత్తలే కాక చక్కటి క్రీడాభిరుచి ఉంది. జులై 26 ఈ లీగ్ మ్యాచులు ప్రారంభం కానుండగా, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో క్రీడాభిమానులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు.

English summary
Telugu Titans organised an impressive function here on Friday to launch its logo and introduce most of its players. It was also an occasion for many to recall how kabaddi was popular in the past, and the need to provide a push to the game and players.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X