తెలుగు టీవీ సీరియల్ నటి దీప్తి ఆత్మహత్య

న్యూఢిల్లీ: బుల్లితెరకు చెందిన మరో నటి ఆత్మహత్య చేసుకుంది. పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు, పేరు తెచ్చుకున్న దీప్తి అలియాస్ రామలక్ష్మి శనివారం ఉదయం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

హైదరాబాద్, బాలానగర్ సమీపంలోని ఫతేనగర్‌లోని ఒక అపార్టుమెంట్‌లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమె మరణానికిగల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసుకు దర్యాప్తు ప్రారంభించారు.

Telugu Tv serial actress commits suicide in Hyderabad

ప్రేమికుల రోజున ఆమె ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అపార్టుమెంట్‌లో దీప్తి శుక్రవారం అర్ధరాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలను తీసుకుంది. ఈ విషయాన్ని గమనించిన అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. పశ్చిగోదావరి జిల్లా తణుకుకు చెందిన దీప్తి ఆడదే ఆధారం, ఆహ్వానం, లక్కీ లక్ష్మి తదితర సీరియళ్లలో నటించింది.

హైదరాబాద్ నగరంలోని మల్కాజ్‌గిరిలో విషాదం చోటు చేసుకుంది. ఆనంద్‌బాగ్‌లో రైల్వే వంతన కోసం తీసిన గుంతలో ఓ మహిళ పడి మృతి చెందింది. దీంతో అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+