రేప్ కేసులో జైలు: చోరీ కేసులో నిందితుడి ఆత్మహత్య
విజయవాడ: పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ అనంతపురం జిల్లా మూడవ అదనపు సెషన్స్ జడ్జి సునీత మంగళవారం తీర్పు ఇచ్చారు. అనంతపురం జిల్లా తలుపుల మండలం పెన్నబడివాండ్ల పల్లికి చెందిన సిద్దార్థ రెడ్డి 2012 ఆగస్టు 4న గ్రామానికి చెందిన బాలికను మభ్యపెట్టి తీసుకెళ్లి, నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు.
బాలిక అవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. జడ్జి సునీత ఈ కేసులో 10 మంది సాక్షులను విచారించారు. నేరం రుజువు కావడంతో బాలిక కిడ్నాప్ కేసులో పదేళ్ల జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమానా, అత్యాచారం కేసులో పదేళ్ల జైలుశిక్ష, పదివేల రూపాయల జరిమానా, బెదిరించినందుకు గానూ రెండు సంవత్సరాల జైలుశిక్ష, రెండువేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

అరెస్టు భయంతో ఆత్మహత్యాయత్నం
పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో పురుగుల మందు తాగి పాత నేరస్తుడు రమేష్ ఆత్మహత్యాయత్నం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి. రమేష్ చోరీలకు పాల్పడుతున్నాడన్న సమాచారంతో అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులు ప్రయత్నించారు. పోలీసుల రాకను గమనించి రమేష్ పురుగుల మందు తాగాడు. కృష్ణా జిల్లా రామవరప్పాడు రింగ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఆస్పత్రికి తరలిస్తుండగా అతను మరణించాడు.












Click it and Unblock the Notifications