తిరుపతమ్మ ఆత్మహత్య: సూసైడ్ నోట్‌లో ఏం రాసింది?

గుంటూరు: గుంటూరు జిల్లా మాచర్లలోని కృష్ణవేణి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న వెల్దుర్తికి చెందిన విద్యార్థిని రాపో లు తిరుపతమ్మ(16) ఆత్మహత్య చేసికున్న విషయం తెలిసిందే. తన మరణానికి ఆరుగురు విద్యార్థులే కారణమంటూ ఆ సూసైడ్‌ నోట్‌లో తిరుపతమ్మ పేర్కొంది. మాచర్ల పట్టణంలోని పలు కళాశాలల్లో చదువుతున్న ప్రేమ్‌రాజ్‌నాయక్‌, గాబ్రియేల్‌నాయక్‌, పవన్‌, ఆదినారాయణ, వెంకటేష్‌, సురేష్‌ల వేధింపులే కారణమని తెలిపింది. వారంతా వెల్దుర్తి మండల పరిధిలోని వెల్దుర్తి, శిరిగిరిపాడు, పలు తండాలకు చెందిన వారుగా చెప్పింది. ఆమె రాసిన సూసైడ్ నోట్‌లోని వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ప్రేమ్‌రాజ్‌నాయక్‌ను వదలొద్దు..

ఏమీ తెలియని అమ్మాయిలకు స్నేహం పేరుతో దగ్గర చేరి.. మత్తుమందు ఇచ్చి లోబరుచుకుంటున్నాడు ఆ తరువాత వీడియోలు ఉన్నాయని బెదిరిస్తూ పలువురి జీవితాలతో ఆడుకున్న ఇతడ్ని ముక్కలు ముక్కలుగా నరకాలి. పది మంది అమ్మాయిలను వంచించిన వీడ్ని చంపేయాలి.

Text of suicide note of Tirupathamma

నాన్నా.. అమ్మను బాగా చూసుకో..

ఇప్పటి వరకు అమ్మను చిత్రహింసలు పెట్టావు.. అమ్మ అమాయకురాలు.. అమ్మతో అన్యోన్యంగా ఉంటే నా ఆత్మ శాంతిస్తుంది. అన్న పోలీస్‌ ఆఫీసరో, లాయరో అవ్వాలని కాంక్షించాను. నా కోరికను అన్న (గోవింద్) నెరవేర్చాలి. నేను ఏ తప్పు చేయలేదు.. దూరమైనందుకు బాధపడొద్దు..

- మీ ముద్దుల కూతురు తిరుపతమ్మ

తిరుపతమ్మ సూసైడ్‌ నోట్‌లో తన మరణానికి కారణంగా పేర్కొన్న ఆరుగురి విద్యార్థుల కోసం గురజాల డీఎస్పీ నాగేశ్వరరావు నేతృత్వంలో రూరల్‌ సీఐ శివశంకర్‌ రంగంలోకి దిగారు. ఏయే కళాశాలల్లో ఈ ఆరుగురు చదువుతున్నారు. ఇప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలు వీరి వేధింపులకు గురయ్యారనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం రాత్రి నాటికి ఆరుగురి ఆచూకీ లభ్యం కానట్లు సీఐ శివశంకర్‌ ఆంధ్రజ్యోతికి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+