• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆపరేషన్ గరుడ: లోకేష్, బీజేపీపై మహిళల ఫైర్, 'ఐటీ దాడులపై బీజేపీ, వైసీపీ అప్పుడే చెప్పింది'

|
  ఐటీ దాడులపై బీజేపీ.. వైసీపీ అప్పుడే చెప్పింది : నారా లోకేష్

  అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ తన ఆపరేషన్ గరుడలో భాగంగా ఆంధ్రులపై దాడులు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం మండిపడ్డారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ సోదాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

  ప్రత్యేక హోదా, విభజన వంటి పలు హామీలపై నిలదీసినందుకు ఆంధ్రప్రదేశ్ పైన నరేంద్ర మోడీ కక్ష కట్టారని విమర్శించారు. కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు అని సీఎం రమేష్ అన్నందుకే ఈ ఐటీ దాడులు అని ఆరోపించారు. కాగా, కడపకు ఉక్కు కర్మాగారం రాకుండా సీఎం రమేష్ అడ్డుకున్నారనేది విపక్షాల వాదనగా ఉంది.

  తప్పు చేయలేదు, భయపడను: సీఎం రమేష్ ఐటీ శాఖకే నోటీసులిచ్చిన మూడ్రోజుల్లో దాడులు

  ఇబ్బందులు పెట్టినా.. ప్రత్యేక హోదా మా హక్కు

  ఇబ్బందులు పెట్టినా.. ప్రత్యేక హోదా మా హక్కు

  సీఎం రమేష్ కడప ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేసి వంద రోజులు పూర్తవుతున్నా ఇప్పటి వరకు స్పందించలేదని నారా లోకేష్ మండిపడ్డారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలనే ఈ ఆదాయ పన్ను శాఖ దాడులు అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రత్యేక హోదా సాధనలో వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదాను సాధిస్తామని చెప్పారు.

  అందుకే ఈ ఐటీ దాడులు

  అందుకే ఈ ఐటీ దాడులు

  నరేంద్ర మోడీ ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదాతో పాటు 18 హామీలను నెరవేర్చాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై నిలదీసినందుకే కక్ష సాధింపుతో మొన్న బీద మస్తాన్ రావు, నిన్న సుజనా చౌదరి, ఈ రోజు సీఎం రమేష్ ఆస్తులపై ఐటీ దాడులు అన్నారు. పెట్టుబడులు రాకుండా పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

  కేంద్రమంత్రిని నిలదీశా అందుకే

  కేంద్రమంత్రిని నిలదీశా అందుకే

  అంతకుముందు, ఐటీ దాడులపై సీఎం రమేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ సోదాలు అన్నారు. ఐటీ దాడుల వెనుక కేంద్రం హస్తం ఉందన్నారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేసే కుట్రలు అన్నారు. గురువారం కేంద్రం మంత్రి బీరేంద్రసింగ్‌ను కలిసి కర్మాగారం ఏర్పాటుపై నిలదీశానని, దీనికి ప్రతిఫలంగా మరుసటిరోజే నాపై ఐటీ దాడులు చేయించారన్నారు.

  ఐటీ అధికారులకు సహకరించమని చెప్పా

  ఐటీ అధికారులకు సహకరించమని చెప్పా

  కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినందుకే కేంద్రం ఐటీ దాడులతో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తోందని సీఎం రమేష్ మండిపడ్డారు. కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌, తెలంగాణతో పాటు ఏపీలో తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై ఐటీ దాడులు చేయిస్తున్నారన్నారు. ఐటీ అధికారులకు సహకరించమని తన అనుచరులకు చెప్పానని, గాంధేయ పద్ధతిలోనే నిరసన తెలియజేయాలని చెప్పానని అన్నారు.

   బీజేపీ, వైసీపీ కొద్ది రోజుల క్రితమే చెప్పాయి

  బీజేపీ, వైసీపీ కొద్ది రోజుల క్రితమే చెప్పాయి

  సీఎం రమేష్ పైన ఐటీ దాడులు జరుగుతాయని బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజుల క్రితమే చెప్పిందని అన్నారు. వైసీపీ చెప్పినట్లే బీజేపీ నడుచుకుంటోందని ఆరోపించారు. వారి కుట్ర రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై వెనక్కి తగ్గమని చెప్పారు. కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామన్నారు. కాగా, సీఎం రమేష్ ఆస్తులపై ఏకకాలంలో 25 నుంచి 30 చోట్ల వందమంది అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రిత్విక్ కంపెనీకి చెందిన బ్యాంక్ అకౌంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, కడపలో సీఎం రమేష్ నివాసం వద్దకు మహిళా టీడీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ, మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Centre has begun intimidation politics with IT raids on party leaders Mastan Rao garu, Sujana garu and now CM Ramesh garu . TDP leaders are being unduly targeted for raising voice against the Centre for breaking every promise made during bifurcation.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more