వైసీపీ స్కామ్ ల లిస్ట్ రెడీ ?, ఆ నాయకులకు కౌంట్ డౌన్ మొదలైంది కాస్కో

ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం లో జరిగిన అక్రమాలు మొత్తం బయటకు తీయాలని సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ డిసైడ్ అయ్యారు అని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రతి శాఖలో వైసీపీ నాయకులు అనేక అవ్యవహారాలు పాల్పడ్డారని అప్పటి నుంచి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే

గత జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన చాలామంది వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని, అప్పట్లో అధికారం అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ ఏ శాఖలో ఎంత మొత్తంలో అవ్యవహారాలు జరిగాయి అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పెద్దలు ఆరా తీస్తున్నారని, త్వరలో వైసీపీ లెక్కలు తేలిపోతాయని సమాచారం.

The coalition government focused on the scams that took place in the previous YCP government

గత అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన సీఐడీ అధికారులు ఆయన్ను జైలుకు పంపించారు. చంద్రబాబు పైన వచ్చింది వందల కోట్ల రూపాయాల ఆరోపణలే అయినా ఆ కేసులో ఆయన్ను సుమారు రెండు నెలల పాటు జైల్లో పెట్టారు. ఆ సమయంలో చాలా మంది వైసీపీ నాయకులు, అప్పటి మంత్రులు చంద్రబాబు అవినీతిపరుడు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు.

అయితే గత వైసీపీ ప్రభుత్వంలో వేలాది కోట్ల రూపాయల అవ్యవహారాలు జరిగాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ స్కాం, ఇసుక స్కామ్, లిక్కర్ స్కామ్, భూ దందాలు ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయని, ప్రతి శాఖలో భారీ ఎత్తున జరిగిన అవినీతి వ్యవహారాలు మొత్తం బయటకు లాగాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసింది. అలాగే పర్యాటక శాఖ నియమాలకు విరుద్ధంగా అనేక జిల్లాల్లో అక్రమంగా పలు ప్రైవేట్ కంపెనీలకు అనుమతులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.

The coalition government focused on the scams that took place in the previous YCP government

ఇక తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లు నరికేసి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలించారని ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సిలికాన్ మైనింగ్ వ్యాపారంతో లూటీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, కొడాలి నాని, పేర్ని నాని, ఆర్ కే. రోజా, అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ తదితరులు నిర్వహించిన శాఖల పైన కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని తెలిసింది.

అప్పుడు మంత్రి పదవుల్లో ఉన్న వైసీపీ నాయకులు ఏ రైంజ్ లో స్కామ్ లు చేశారు, ఆ శాఖల్లో అవ్యవహారాలు జరిగాయా, లేదా ? అని కూటమి ప్రభుత్వం ఆరా తీస్తోందని తెలిసింది. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి తో పాటు వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ప్రతి నాయకుడు ఏఏ శాఖలు నిర్వహించారు, ఆ శాఖలకు అప్పటి జగన్ ప్రభుత్వం ఎన్ని కోట్లు నిధులు కేటాయించింది, ఎంత ఖర్చు చేశారు ? ఎంత మింగేశారు అని కూటమి ప్రభుత్వం ఆరా తీయడం మొదలు పెట్టిందని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి శాఖకు చెందిన సంబంధిత అధికారుల నుండి ఇప్పటికే కూటమి పెద్దలు వివరాలు సేకరిస్తున్నారు అని తెలిసింది. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు వివిద కార్పొరేషన్ల చైర్మన్లుగా వ్యవహరించిన వివిధ శాఖల వ్యవహారాలు కూడా బయటకు లాగుతున్నారని తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన స్కామ్ లు బయటకు తీస్తున్న కూటమి ప్రభుత్వం పెద్దలతో దెబ్బతో వైసీపీ స్కాముల కౌంట్ డౌన్ మొదలైందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+