ఏసీబీ కస్టడీలో వెంకటరెడ్డి నోరు విప్పితే అంతే కథ, టెన్షన్

గత వైసీపీ ప్రభుత్వంలో గనులు, ఖనిజం, ఇసుక దోపిడీకి గురి అయ్యిందని ఆరోపిస్తూ నమోదు అయిన కేసులో అరెస్టు అయిన ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని కస్టడీలోకి తీసుకోవడానికి ఏసీబీ అధికారులు సిద్ధం అయ్యారు. మూడు రోజులపాటు ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారణ చేయడానికి ఏసీబీ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ సర్వీసు నుండి డిప్యూటేషన్ పై వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు.

గత వైసీపీ ప్రభుత్వంలో పుంగనూరు నియోజక వర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గనుల శాఖ మంత్రిగా పని చేశారు ఆ సందర్బంలో వీజీ వెంకటరెడ్డిని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ ఎండీగా బాధ్యతలు అప్పగించారు. గనుల శాఖ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరెడ్డి ఆ తరువాత వైసీపీ నాయకులకు అనుకూలంగా ఉన్న పలు సంస్థలకు ఇసుక కాంట్రాక్టులు అప్పగించారని ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు.

The court allowed the former director of mines Venkata Reddy to be handed over to ACB custody

గనుల శాఖ నియమాలను తుంగలో తొక్కిన వెంకటరెడ్డి పలు కంపెనీలకు ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చారని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇసుక కాంటాక్ట్ తీసుకున్న ఆ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి మోతాదుకు మించి ఇసుక తవ్వకాలు చేశారని, వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు కూడా చెల్లించకుండా సదరు సంస్థలు మోసం చేశాయని ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు.

ఇంత జరిగినా కూడా వెంకటరెడ్డి చూసి చూడనట్లు వ్యవహరించారని, ఆ సంస్థలు ప్రభుత్వానికి బకాయిలు చెల్లించుకున్నా వెంకటరెడ్డి పట్టించుకోలేదని ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. చివరికి ఆ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాకీ ఉన్న బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆ సంస్థలకు వెంకటరెడ్డి క్లియరెన్స్ సర్టిఫికెట్లు, ఎన్ఓసీ ఇచ్చేశారని ఏసీబీ అధికారులు ఆరోపించారు.

The court allowed the former director of mines Venkata Reddy to be handed over to ACB custody

వెంకటరెడ్డి తీరుతో ఇసుక కాంట్రాక్టులు తీసుకున్న ఆ సంస్థలు భారీ మొత్తంలో అక్రమంగా వందల కోట్ల రూపాయలు సంపాదించారని ఏసీబీ అధికారులు ఆరోపించారు. ఇసుక కాంట్రాక్టర్లతో వెంకటరెడ్డి కుమ్మక్కు కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 2, 500 కోట్లకు పైగా నష్టం వచ్చిందని ఆయన పై కేసు నమోదు చేశారు. ఇప్పుడు వెంకటరెడ్డిని ఏసీబీ కస్టడీకి ఇవ్వడంతో ఆయన విచారణలో ఏలాంటి విషయాలు బయటపెడతారో అని కొన్ని ఇసుక కాంటాక్టు సంస్థలు హడలిపోతున్నాయని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+