కరోనా టైమ్ లో జగన్ ఎన్నిసార్లు బయటకు వచ్చారు ?, సిగ్గుండి మాట్లాడుతున్నారా ?

వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి వర్గంలోని నాయకులు ఇస్తున్న లీకుల వల్లనే ఆ పార్టీ నాయకులు అరెస్టు అవుతున్నారని ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. టిడిపి కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి వర్గం ఉందని, అందులో ఎలాంటి అనుమానం లేదని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు.

ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, వైఎస్ఆర్ సీపీ పార్టీ పదవులు ఇస్తామని ఆశలు చూపించిన సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయించారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. వీటన్నిటికీ కారణమైన సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్టు చేస్తే ఇలాంటి దాడులు ఆగిపోతాయని, ఆ పార్టీకి పట్టిన దరిద్రం కూడా పోతుందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు ఆరోపించారు.

The former minister alleged that the hand of the same party leader was behind the arrest of the YCP leaders

విజయవాడలో వరదలు రావడానికి ప్రకృతి వైపరీత్యాలు ఓ కారణమని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు అక్రమంగా మట్టిని తవ్వే వేశారని, అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఇదంతా విజయవాడలో వరదలు రావడానికి మరో కారణమైందని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. వైసీపీ నాయకులు చేసిందంతా చేసి ఇప్పుడు సిగ్గు లేకుండా ఆ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు.

వైసీపీ నాయకులకు చేతనైతే వరద బాధితులకు సహాయం చేయాలి తప్పా ఇలాంటి కుళ్ళు రాజకీయాల చేయకూడదని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి 74 ఏళ్లు వచ్చాయని, ఈ వయసులో కూడా ఆయన అలుపెరగకుండా విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఆయన్ను విమర్శించడానికి వైసీపీ నాయకులకు నోరు ఎలా వస్తావుందో తెలియడం లేదని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు.

The former minister alleged that the hand of the same party leader was behind the arrest of the YCP leaders
జగన్ లాగా పరదాలు కట్టుకొని ప్యాలెస్ లో కూర్చొని కథలు చెప్పలేదని, కరోనా వైరస్ వచ్చిన సమయంలో జగన్ ఎన్నిసార్లు బయటకు వచ్చారు, ఎన్ని సహాయక శిభిరాల్లో పాల్గొన్నారు అనే విషయాన్ని వైసీపీ నాయకులు బహిరంగంగా చెప్పాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీ నాయకును ప్రశ్నించారు. కరోనా వైరస్ వ్యాపించిన సమయంలో అప్పటి సీఎం హోదాలో ఉన్న జగన్ ఎన్నిసార్లు బయటకు వచ్చారు, ఎన్ని సహాయక శిబిరాల్లో పాల్గొన్నారు అనే విషయంపై చర్చించడానికి వైసీపీ నాయకులు బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా అంటూ మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీ నాయకులు ప్రశ్నించారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో మాయమైన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ హైదరాబాద్ లో ఉన్నాడని, ఆయన్న పట్టుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి శిబిరంలోని వైసీపీ నాయకులు పోలీసులకు పక్కా సమాచారం ఇచ్చారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. ఎస్సీ వర్గానికి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్ట్ చేస్తే వైసీపీకి సానుభూతి ఇంకా పెరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్కెచ్ వేశాడని డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు.

The former minister alleged that the hand of the same party leader was behind the arrest of the YCP leaders

సజ్జల రామకృష్ణారెడ్డి స్కెచ్ లో భాగంగానే నందిగం సురేష్ ఎక్కడ ఉన్నాడో అనే సమాచారం పోలీసులకు అందించారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. విజయవాడ చెందిన వైసీపీ నాయకులు ఉండే రహస్య ప్రాంతాల సమాచారాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి వర్గం ఎందుకు బయట పెట్టలేదని, ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి ఆడుతున్న నాటకమని, మొదట ఆయన్ను అరెస్టు చేస్తే ఇలాంటి నాటకాలు అన్నింటికీ తెర పడుతుందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+