Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!

నియోజకవర్గాల పునర్విభజన పైన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ఆమోదించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 15,16,17 పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేసింది.నియోజకవర్గాల పునర్విభజన ..కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు పై చర్చ.. ఆమోదించే అవకాశం వేళ కొత్త అంశం తెర మీదకు వచ్చింది. దీంతో.. అసలు ఈ నిర్ణయం ఎవరికి కలిసి వస్తుందనే చర్చ మొదలైంది.

నియోజకవర్గాల పెంపు రాజకీయంగా హీట్ పెంచుతోంది. లోక్ సభతో సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50 శాతానికి పెరగను న్నాయి. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా, మహిళా రిజర్వేషన్లు అమలు చేయనుంది. ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన ద్వారా కేంద్రం తాజా ప్రతిపాదనల మేరకు ప్రస్తుతం ఉన్న 175 స్థానాలు 263కి చేరనున్నాయి. అదే విధంగా ప్రస్తుతం ఉన్న 25 లోక్ సభ స్థానాలు 38కి చేరనున్నాయి. అయితే.. ఈ ప్రాతిపాదికన జిల్లాల వారీగా పెరిగే సీట్ల పైన ఒక అంచనా సిద్దం చేసారు. గ్రేటర్ రాయలసీమలో ఉన్న ఆరు జిల్లాల్లో అనంతపురంలో ప్రస్తుతం ఉన్న 14 స్థానాలు ఇక 21కి చేరనున్నాయి. అదే విధంగా కర్నూలు జిల్లాలో 14 నుంచి 21కి, కడపలో 10 నుంచి 15కు, చిత్తూరు లో 14 నుంచి 21, నెల్లూరులో పది నుంచి 15కు, ఇక.. ప్రకాశంలో 12 స్థానాలు 18కి పెరగనున్నాయి. దీంతో.. మొత్తం ఈ రీజియన్ లో ప్రస్తుతం ఉన్న 74 సీట్లు 37 పెరగటం ద్వారా 111కి చేరనున్నాయి. 2019 ఎన్నికల్లో ఈ రీజియన్ లో వైసీపీ ఏకపక్షంగా సీట్లు గెలవగా .. 2024 లో సీన్ రివర్స్ అయి కూటమి మెజార్టీ సీట్లు దక్కించుకుంది.

ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!!
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!!
the-government-may-reconvene-parliament-to-introduce-a-bill-increasing-lok-sabha-seats

జిల్లాల వారీగా పెరిగే సీట్లు.. రాజకీయ అంచనాలు

ఇక, గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న సీట్లు 17 నుంచి 25కి చేరనున్నాయి. కృష్ణా లో పునర్వి భజన తరువాత సీట్లు 24కు పెరగనున్నాయి. దీంతో. ఈ రెండు జిల్లాల్లో 49 స్థానాలు కాను న్నాయి. ఇక్కడ ప్రస్తుతం కూటమి ఆధిపత్యం కొనసాగుతోంది. వైసీపీకి పునర్విభజన తరువాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయనేది కీలకంగా మారనుంది. ఇక, రాష్ట్రంలో అధికారం డిసైడ్ చేసే ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న 34 స్థానాల 50కి చేరనున్నాయి. తూర్పు గోదావరి లో ప్రస్తుతం 19 ఉండగా 28కి పెరగనున్నాయి. అదే విధంగా పశ్చిమ గోదావరిలో 15 స్థానాలు 22కి చేరుతాయి. ఇక్కడ పవన్ తో సహా కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ జిల్లాల్లో సామాజిక సమీకరణాలు.. నియోజకవర్గాల పెంపు అధికారం డిసైడ్ చేయటంలో కీలకంగా మారనున్నాయి. ఇక, ఉత్తరాంధ్రలో విశాఖలో 15 నుంచి 23, విజయనగరం లో ప్రస్తుతం ఉన్న 9 స్థానాలు 15కు, శ్రీకాకుళంలోనూ 15 కు సీట్లు పెరగటం ద్వారా మొత్తంగా 34 స్థానాలు 53 కి చేరనున్నాయి. దీంతో.. అధికారంలోకి రావటానికి మేజిక్ ఫిగర్ 132 కానుంది. ప్రతిపక్ష హెదా దక్కాలంటే 26 స్థానాలు రావాల్సి ఉంటుంది. మంత్రివర్గ సభ్యుల సంఖ్య 39 వరకు అవకాశం ఉండనుంది. దీంతో.. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా కూటమి వర్సస్ వైసీపీ మధ్య ఎవరికి ఏ మేర కలిసి వస్తుందనే అంచనాలు మొదలయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+