టీటీడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం, కీలక ఆదేశాలు..!!
టీటీడీ అధికారుల పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణి కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ అధికారుల తీరుపై హైకోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 27న టీటీడీ ఈవో.. కోర్టు ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది.
తిరుమల పరకామణి కేసులో హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు సీజ్ చేసిన ఫైళ్లు సహా ప్రాథమిక దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సీఐడీ సమర్పించింది. కాగా, ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ అధికారుల తీరుపై హైకోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 27న టీటీడీ ఈవో.. కోర్టు ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. లేనిపక్షంలో 20 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో...తిరుమల పరకామణిలో చోరీ ఘటనపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని హైకోర్టును టీటీడీ కోరింది.

2023లో తిరుమలలో పరకామణి చోరీ పై టీటీడీ విజిలెన్స్‌కు ఫిర్యాదు అందింది. రవికుమార్ అనే ఉద్యోగి పెద్ద ఎత్తున పరకామణిని కొల్లగొట్టారని ఆరోపణలతో ఫిర్యాదులు వెళ్లాయి. అయితే ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపకుండానే అప్పటి టీటీడీ అధికారులు లోకాయుక్తతో రాజీ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, తాజాగా పరకామణిలో చోరీ వ్యవహారంపై శ్రీనివాసులు అనే వ్యక్తి పిటిషన్ వేయడంతో ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. పరకామణి చోరీ కేసులో చోరీపై సీఐడీ విచారణకు న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో తిరుమల పరకామణిలో దస్త్రాలను సీఐడీ అధికారులు సీజ్ చేసింది. రవికుమార్ అనే వ్యక్తి పెద్ద జీయర్ మట్టం నుంచి 15 సంవత్సరాలుగా రెగ్యులర్గా పరకామణి డ్యూటీకి వస్తున్నారని.. గత ఎడాది ఏప్రిల్ 29న సీసీ కెమెరాల్లో ఆయన చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని పిటీషనర్ వివరించారు.ఈ వ్యవహారంపై సీఐడీ విచారణ సరిపోదని.. సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications