జగన్ కేసులో ట్విస్ట్, సీబీఐ కోర్టులో రోజువారీ విచారణ చెయ్యండి, హైకోర్టు ఆర్డర్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి కష్టాలు మొదలైనాయి. ఐదు సంవత్సరాల పాటు సీఎం హోదాలో ఉన్న వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. సీఎంగా పని చేస్తున్న తాను కోర్టు విచారణకు హాజరుకాలేకపోతున్నానని వైఎస్ జగన్ ఇంతకాలం కోర్టుకు చెబుతూ తప్పించుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సీబీఐ కోర్టులో జరుగుతోంది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ తెలంగాణ హైకోర్టు చేపట్టింది. ఇలాంటి సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది.

The High Court orders that YS Jagan s cases should be investigated on a day-to-day basis

సీబీఐ కోర్టులో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసు రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కోర్టులో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు రోజువారీ విచారణకు రంగం సిద్దం అయ్యిందని తెలిసింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

హరిరామ జోగయ్య వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఇదే సమయంలో వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో విచారణ దర్యాప్తు సాగుతోందని హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు కేసు విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది. ఇంతకాలం సీఎం హోదాలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పించుకున్నారని, ఇక ముందు ఆయన కోర్టు ముందు హాజరై కేసు విచారణను ఎదుర్కోవలసి ఉంటుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+