తిరుమల లడ్డూ, వైసీపీ పాపాలు, ప్రజలకు శాపాలు, వెంటాడి వెంటాడి ?

తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం కల్తీ నెయ్యి ఉపయోగించడానికి అనుమతి ఇచ్చి వాళ్లు ఎవరైనా సరే వాళ్ల మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం కల్తీ నెయ్యి ఉపయోగించి ఆ సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇంతకాలం తప్పించుకున్న వాళ్లు చట్టం నుంచి తప్పించుకున్నా శ్రీ వెంకటేశ్వర స్వామి నుంచి మాత్రం తప్పించుకోలేని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో పాలు, నీళ్లు, నెయ్యి, మద్యం, బియ్యం ఇలా ఏది చూసుకున్నా మొత్తం కల్తీ చేశారని, చివరికి కమిషన్ల కోసం ఆశపడి శ్రీవారి లడ్డులు తయారు చేయడానికి కల్తీ నెయ్యి సరఫరా చేసేందుకు అనుమతించారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. గత వైసీపీ పాలన మొత్తం కల్తీ మయం అయ్యిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. దోచుకున్నంత దోచుకున్న వైసీపీ నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు వేదాంతం మాట్లాడుతున్నారని మంత్రి రవికుమార్ మండిపడ్డారు.

The minister accused YCP leaders of committing sins that should not have been committed in Jagan s government

చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి వైసీపీ నాయకులు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ అంటూ జగన్ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ను సర్వనాశనం చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును దెబ్బతీశారని మంత్రి రవికుమార్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో పీపీఏలను రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ను దోచుకున్న వైసీపీ చివరికి ఆ దేవదేవుడు కొలువు తీరిన తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. శుక్రవారం తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి విషయంపై సుమారు ఒకటిన్నర గంట మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ గుజరాత్ లోని ఎన్ డీడీబీ ఇచ్చిన నివేదికపై ఎందుకు సమాధానం చెప్పలేకపోయారని మంత్రి గొట్టిపాటి రవి రవికుమార్ వైసీపీ నాయకులను నిలదీశారు.

The minister accused YCP leaders of committing sins that should not have been committed in Jagan s government

చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి జగన్ తో పాటు ఆయన శిష్య బృందం కూడా ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రజలు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు అన్ని విషయాలను గమనిస్తున్నారని మంత్రి రవి కుమార్ అన్నారు. శ్రీవారి లడ్డూల తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా చేసి తాత్కాలికంగా తప్పించుకున్నా వాళ్లు ఆ దేవుడి శిక్ష నుండి మాత్రం తప్పించుకోలేరని, ఆ రోజులు దగ్గరలోనే వస్తాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జగన్ ప్రభుత్వంలో వైసీపీ నాయుకులు చేసిన పాపాలు ఇప్పటికి ప్రజలను వెంటాడుతున్నాయని మంత్రి రవికుమార్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+