మెంటల్ కృష్ణ ఎక్కడ ?, ఎటూ కాకుండాపోయిన పోసాని, మోగా ఫ్యామిలీ దెబ్బకు ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎవ్వరూ ఊహించని విధంగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్లిపోతుందని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తుందని చాలా మంది అంచనా వేశారు. అయితే కూటమి తుఫానులో వైసీపీ కొట్టుకుపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడు ఓ వ్యక్తి పరిస్థితి అయోమయంగా మారిపోయింది.

ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళికి పరిస్థితి ఉన్నదిపోయే, ఉంచుకున్నది పోయే అనే సామెతలా తయారైయ్యింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేవుడు, చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాక్షసులు అని ఇంతకాలం మీడియా ముందు పోసాని కృష్ణ మురళి పదేపదే ఆరోపణలు చేశారు. మాకులం నాయకులను నేను వ్యతిరేకిస్తున్నానని, పేదలకు మంచి చేసే జగన్ ను తాను గౌరవిస్తానని పోసాని కృష్ణ మురళి అన్నారు.

The situation of film actor Posani Krishna Murali who criticized Pawan Kalyan has become worse

అయితే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. త్వరలో చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కూటమి ప్రభుత్వం అధికారం చేపడుతుంది. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన పోసాని కృష్ణ మురళి నోటికి వచ్చినట్లు విమర్శించారు. పోసాని కృష్ణ మురళిని పవన్ కల్యాణ్ విమర్శించకపోయినా పవర్ స్టార్ అభిమానులు, మెగా అభిమానులు ఎప్పటికప్పుడు పోసాని కృష్ణ మురళికి చివాట్లు పెడుతూ వచ్చారు.

తన ఇంటి మీద పవన్ కల్యాణ్ ఫాన్స్ దాడులు చెయ్యడానికి ప్రయత్నించారని, తనకు రక్షణ కల్పించాలని పోసాని కృష్ణ మురళి గతంలో చాలా సార్లు పోలీసులకు మనవి చేశారు. అయితే పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రం ఆ మెంటల్ కృష్ణ మీద మేమెందుకు ప్రతాపం చూపిస్తామని, అతన్ని పట్టించుకోవడం మేము ఎప్పుడో వదిలేశామని బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు పోసాని కృష్ణ మురళి పరిస్థితి ఎటూ కాకుండాపోయింది.

The situation of film actor Posani Krishna Murali who criticized Pawan Kalyan has become worse

పోసాని కృష్ణ మురళి నటుడిగా బిజీ అయిపోయిన తరువాత పోసాని దగ్గర కథలు, సినిమాలకు డైలాగులు రాపించుకునే డైరెక్టర్లు కరువయ్యారు. జగన్ తనను ఉద్దరిస్తాడని అనుకున్న పోసాని కృష్ణ మురళి పవన్ కల్యాణ్ తో పెట్టుకుని పెద్ద తప్పు చేశాడని సినీ అభిమానులు అంటున్నారు. ఇక మెగా కుటుంబంలోని హీరోల సినిమాల్లో పోసాని కృష్ణ మురళికి దాదాపుగా అవకాశాలు రావని సినీ అభిమానులు అంటున్నారు.

మోగా ఫ్యామిలీలో ఏ హీరో సినిమాలో కూడా పోసాని కృష్ణ మురళి ఎలాంటి ఛాన్స్ వచ్చే అవకాశం లేదు. ఇక రచయితాగా చాలా ఏళ్ల నుంచే పోసాని కృష్ణ మురళికి అవకాశాలు లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కుప్పకూలిపోవడం, మెగా ఫ్యామిలీతో పెట్టుకోవడంతో పోసాని కృష్ణ మురళి పరిస్థితి దారుణంగా తయారైయ్యింది. ఇటు వైసీపీ నాయకులు దూరం కావడం, సినిమాల్లో అవకాశాలు వస్తాయో రావో తెలీక పోసాని కృష్ణ మురళి సైలెంట్ అయిపోయారని తెలిసింది. ఇంతకాలం ఏడైలాగ్ చెప్పినా చివరిలో ఐలవ్ యూ రాజా అని చెప్పిన పోసాని కృష్ణ మురళి ఎక్కడా కనపడటంలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+