Nadyala: సుగాలిమెట్ట ప్రాంతంలో బయటపడిన అమ్మవారి విగ్రహం..

నంద్యాల మండలం సుగలిమెట్ట వద్ద పోలంలో అమ్మవారి విగ్రహం బయట పడింది. దీంతో అక్కడి భక్తులు భారీగా చేరుకున్నారు.హైదరాబాద్ కు చెందిన వ్యక్తి మహనంది దర్శించడానికి వెళ్తుండగా సదరు వ్యక్తికి ఇక్కడ నేనున్నానని అమ్మవారు చెవిలో చెప్పినట్లు చెబుతున్నారు. అమ్మవారి విగ్రహం కోసం వారు గత రెండు రోజులుగా వెతుకుతున్నారు. ఈ క్రమంలో సుగాలిమెట్ట వద్ద అమ్మవారి విగ్రహం బయటపడింది.

అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారి విగ్రహం బయట పడడంతో సుగాలిమెట్ట ప్రాంతం కోలాహలంగా మారింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు, టెంకాయలు కొడుతున్నారు. "నాది హైదరాబాద్. మా బాబు నంద్యాలలో ఉంటాడు. మా అబ్బాయి, పిల్లల్ని చూడడానికి నాలుగు రోజుల క్రితం వచ్చాను. మహనాంది దగ్గర అని చెబితే చూసి పోదామని వచ్చాయి. బైక్ వెళ్తున్నాం. ఈ ప్రాంతం దాటి వెళ్లిపోతుండగా.. ఓరే నేను ఇక్కడే ఉన్నాను అని మాటలు వినిపించినట్లు" ఆ వ్యక్తి చెప్పాడు.

The statue of Ammavaru was exposed in Sugalimetta area

"నేను వెంటనే బండి వెనక్కు తిప్పమని చెప్పాను. నీకు ఏమన్న వినపడుతుందా అని మా అబ్బాయిని అడిగాను. తనకు ఏం వినపడడం లేదని చెప్పాడు. కానీ నాకు మాత్రం వినపడుతుంది. ఎవరో తెలియదు కానీ ఇక్కడున్నానని చెబుతోంది. ఆ రోజు సాయంత్రం మళ్లీ వచ్చాం. మొత్తం తిరిగాం కానీ సౌండ్ రాలేదు. రెండు రోజుల తర్వాత నేను అమ్మవారి పూజ చేసుకుంటుండగా.. ఎవరు నువ్వు అడిగితే అంబిక దేవి అని చెప్పింది" అని వివరించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+