ఆఫ్ లైన్ బుకింగ్ రద్దు: ఇకపై ఆ టికెట్లు ఆన్ లైన్ లో మాత్రమే- స్పష్టం చేసిన టీటీడీ

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 68,838 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 22,212 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.49 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో 25 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

The tickets for Sri Srinivasa Vishesha Homam will be issued only through online booking

తిరుప‌తి అలిపిరిలోని సప్త గోప్ర‌ద‌క్షిణ‌ మందిరంలో టీటీడీ ప్ర‌తి రోజు నిర్వ‌హించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్ర‌హం టికెట్లను ఆగ‌స్టు 1వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో మాత్ర‌మే జారీ చేస్తారు. ఇందులో పాల్గొనదలిచిన భక్తుల కోసం టీటీడీ.. ప్ర‌తి రోజు క‌రెంట్ బుకింగ్ ద్వారా 50, ఆన్‌ లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే.

భ‌క్తుల విజ్ఞ‌ప్తి మేర‌కు ఆగ‌స్టు 1వ తేదీ నుండి మొత్తం 200 టికెట్లు కూడా ఆన్‌లైన్‌లో మాత్ర‌మే జారీ చేయాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది. ఆఫ్ లైన్ లో గానీ, కరెంట్ బుకింగ్ ద్వారా గానీ ఇకపై శ్రీ శ్రీనివాస దివ్యానుగ్ర‌హం టికెట్లు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టికెట్లు బుక్ చేసుకోవాల‌ని సూచించింది.

భ‌క్తుల‌ కోరిక మేర‌కు శ్రీవారి పాదాల వ‌ద్ద‌ త‌మ శుభ‌కార్యాలు, విశేష‌మైన రోజుల్లో స్వామివారి అనుగ్ర‌హం కోసం సంక‌ల్పం చెప్పుకొని య‌జ్ఞం నిర్వ‌హించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ విశేష హోమంలో రూ.1600లు చెల్లించి గృహ‌స్తులకు (ఇద్ద‌రు) పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న గృహస్తులకు రూ.300ల ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

టీటీడీకి విరాళాలు..

తిరుపతికి చెందిన ఎల్వీ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ పీసీ రాయల్ గురువారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. అదేవిధంగా బెంగుళూరుకు చెందిన సుకుమార్ అనే భక్తుడు శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని (స్విమ్స్) పథకానికి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు దాతలు తిరుమలలో టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరిని కలిసి విరాళం మొత్తంతో కూడిన డీడీలను అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+