దేశంలో ప్రముఖ 8 కృష్ణ దేవాలయాలు ఇవే... ఒక్కసారైనా వెళ్లి రండి!!

సెప్టెంబర్ 6 ,7 తేదీలలో దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈరోజు ఉదయం నుండి కృష్ణ ఆలయాలకు భక్త జనం పోటెత్తుతుంది. భారతదేశ వ్యాప్తంగా అనేకచోట్ల శ్రీకృష్ణుని ఆలయాలు ఉన్నాయి. శ్రీకృష్ణ జయంతి సందర్భంగా అన్ని ఆలయాలలోను స్వామివారికి ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి. ఇక ఈ సమయంలో దేశంలో ప్రముఖమైన ఎనిమిది కృష్ణ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

బృందావన్ లోని ఇస్కాన్ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ ఇస్కాన్ ఆలయం 1975 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఇస్కాన్ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. పూరీలోని జగన్నాథ దేవాలయంలోనూ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తారు . పూరిలోని జగన్నాథ ఆలయం ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా పురాతనమైన ఆలయంగా చెబుతారు. ఈ కృష్ణ ఆలయం కూడా చాలా ప్రసిద్ధిగాంచినది.

These are the 8 famous Krishna temples in the country... visit them at least once!!

ఇక రాజస్థాన్లోని శ్రీనాథ్ జి ఆలయం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. కర్ణాటక రాష్ట్రం హంపిలో ఉన్న బాలకృష్ణ ఆలయం కూడా కచ్చితంగా చూడదగిన మరో కృష్ణ ఆలయం. ఈ ఆలయ అందాలు వర్ణనాతీతం. ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది.

ఇక బెంగళూరులోని ఇస్కాన్ టెంపుల్ కూడా చూడదగిన కృష్ణాలయం. అతిపెద్ద ఇస్కాన్ దేవాలయం బెంగళూరులోని ఇస్కాన్ దేవాలయం. ఇక్కడ కూడా కృష్ణాష్టమి పర్వదినాన వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి శ్రీకృష్ణ మఠంలో కూడా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి. ఈ ఆలయం కూడా చూడవలసిన ఆలయం. 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న చెరువు నీటిలో ఆలయ ప్రతిబింబం కనిపిస్తుంది.

గుజరాత్ లోని శ్రీరామ్ చోద్రిజీ మహారాజ్ ఆలయంలో కూడా కృష్ణాష్టమి వేడుకలు బాగా జరుగుతాయి. ఈ ఆలయం గోమతి నది ఒడ్డున ఉంది. కోల్కతా నుండి 150 కిలోమీటర్ల దూరంలో చంద్రోదయ ఆలయం కూడా చూడవలసిన కృష్ణాలయం. ఇది కూడా ఇస్కాన్ ఆలయమే. ఇక్కడ కూడా శ్రీకృష్ణ జయంతి సందర్భంగా అత్యంత వైభవోపేతంగా వేడుకలు జరుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+