వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాళ్లలా దుష్ర్పచారం చేస్తూనే ఉంటారు.. నేనే ఆశ్చర్యపోయా: నారా లోకేష్

అభివృద్ధి విషయంలో రాయలసీమను తామెప్పుడూ చిన్నచూపు చూడలేదని, నిర్లక్ష్యం చేయలేదని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దుష్ప్రచారం చేసే వాళ్లు చేస్తూనే

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: అభివృద్ధి విషయంలో రాయలసీమను తామెప్పుడూ చిన్నచూపు చూడలేదని, నిర్లక్ష్యం చేయలేదని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అన్ని జిల్లాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని అన్నారు.

దుష్ప్రచారం చేసే వాళ్లు చేస్తూనే ఉంటారు. ఇటీవల ఓ దుష్ప్రచారం చేశారు. 50 ఏళ్ల వయసు పైబడిన వారిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పంపించి వేస్తున్నామని ప్రచారం చేశారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అని లోకేష్ పేర్కొన్నారు.

nara-lokesh

అసలు ఈ విషయమై ఓ జీవో, డిస్కషన్... ఇలా ఏదీ జరగలేదు. ఎటువంటి ఆధారమూ లేకుండానే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంగ్లీషులో ఓ సామెత ఉంది.. 'కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయండి' అని.. అటువంటి పనులు చేస్తున్నారన్నారు.

మొన్నామధ్య ఎస్సీ కార్పొరేషన్ ను తీసేస్తున్నామంటూ దుష్ప్రచారం చేశారు. అసలు, నాకే అర్థం కాలేదు. ఈ అంశంపై చర్చ ఎక్కడ జరిగింది? ఎవరితో మాట్లాడారు? అసలు, మా పార్టీకి ఈ ఆలోచనే రాలేదు..' అని లోకేష్ చెప్పుకొచ్చారు.

English summary
Minister for IT for Andhra Pradesh Nara Lokesh told that they never neglected the development of Rayalaseema region. While speaking in an interview with a News Channel Lokesh told that there is a proverb in english that 'If you can't convince.. just confuse'. Like this some people doing bad publicity in the society about the actions of tdp government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X