ముగ్గురు దొంగల అరెస్ట్: సొత్తు స్వాధీనం(పిక్చర్స్)

విశాఖపట్నం: నగరంలోని ఇళ్లల్లో చోరీలు చేస్తున్న ముగ్గురు నిందితులను పిఎంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 500 గ్రామల బంగారంతోపాటు 10 చీరలు, రూ. 4వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం నగరంలోని సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రైం ఏడిసిపి ఎస్ వరదరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

మధురవాడకు చెందిన తామరావు రాజు, కొమ్మాది, సాయిరాం కాలనీకి చెందిన పిలకా శ్రీను అలియా దీపాలి అలియాస్ రాజు, విజయనగరం విటి ఆగ్రహారానికి చెందిన కోసాను శివగణేష్ పాత నేరస్తులు. జైలు జీవితం గడుపుతున్న సమయంలో వీరికి పరిచయం ఏర్పడింది.

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరందరూ కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. పిఎం పాలెం, ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం, ఆరిలోవ, నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2012 నుంచి ఇప్పటి వరకు 14 ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డారు.

మంగళవారం ఉదయం నిందితులు ముగ్గురు పిఎం పాలెం వైయస్సార్ క్రికెట్ స్టేడియం వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో సిఐ తిరుపతి రావు, ఎస్ఐ రామకృష్ణలు తమ సిబ్బందితో కలిసి వెళ్లి వారిని అరెస్ట్ చేశారని ఏడిసిపి తెలిపారు. దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ఆయన అభినందించారు.

దొంగల అరెస్ట్

దొంగల అరెస్ట్

విశాఖ నగరంలోని ఇళ్లల్లో చోరీలు చేస్తున్న ముగ్గురు నిందితులను పిఎంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 500 గ్రామల బంగారంతోపాటు 10 చీరలు, రూ. 4వేలు స్వాధీనం చేసుకున్నారు.

దొంగల అరెస్ట్

దొంగల అరెస్ట్

ఈ మేరకు బుధవారం నగరంలోని సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రైం ఏడిసిపి ఎస్ వరదరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

దొంగల అరెస్ట్

దొంగల అరెస్ట్

మధురవాడకు చెందిన తామరావు రాజు, కొమ్మాది, సాయిరాం కాలనీకి చెందిన పిలకా శ్రీను అలియా దీపాలి అలియాస్ రాజు, విజయనగరం విటి ఆగ్రహారానికి చెందిన కోసాను శివగణేష్ పాత నేరస్తులు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరందరూ కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు.

దొంగల అరెస్ట్

దొంగల అరెస్ట్

మంగళవారం ఉదయం నిందితులు ముగ్గురు పిఎం పాలెం వైయస్సార్ క్రికెట్ స్టేడియం వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో సిఐ తిరుపతి రావు, ఎస్ఐ రామకృష్ణలు తమ సిబ్బందితో కలిసి వెళ్లి వారిని అరెస్ట్ చేశారని ఏడిసిపి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+