Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైలుకు ఎదురుగా వెళ్లి ప్రేయసీప్రియుల ఆత్మహత్య

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడియం రైల్వేట్రాక్‌పై శుక్రవారం ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజమండ్రి గుత్తుల వారివీధి ఆల్కాట్‌ గార్డెన్స్‌కు చెందిన పాలకుర్తి శ్రీనివాస్‌(28) పెయింటింగ్‌ పనులు చేస్తుంటాడు. శ్రీనివాస్‌కు వివాహమై భార్య, పిల్లలు ఉన్నారు.

శ్రీనివాస్‌కు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం బ్రిడ్జిపేటకు చెందిన చెల్లం కమలకుమారి(25)తో పరిచయం ఏర్పడింది. దీంతో తనకు న్యాయం చేయాలని శ్రీనివాస్‌ భార్య రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు మనస్తాపం చెంది కడియం వచ్చారు. రైలుకు ఎదురుగా వెళ్లి శ్రీనివాస్, కమలకుమారి మృత్యువును ఆహ్వానించారు.

East Godavari map

అక్కడ రైల్వే ట్రాక్‌పై వస్తున్న రైలుకు ఎదురుగా నడుచుకుంటూ వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి మృతదేహాలు ముక్కలు ముక్కలుగా పడిపోయాయి. ఈసంఘటన చూపరులను కలచివేసింది. సంఘటనా స్థలాన్ని రాజమండ్రి రైల్వే పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివాహిత ఆత్మహత్య

బలభద్రపురంనకు చెందిన స బ్బెళ్ల వీరలక్ష్మి(46)కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బిక్కవో లు ఏఎస్‌ఐ ఎంవిఆర్‌ రెడ్డి వివరాలు అందించారు. వీరలక్ష్మి గతఏడాది రైలు నుంచి జారిపడి అనారోగ్యానికి గురైంది. దీంతో కూలిపనిచేసే భర్త ఆమె వైద్యానికి ఇబ్బందులు పడుతుండడంతో వీరలక్ష్మి మనస్తాపం చెంది గురువారం ఉదయం బాత్‌రూంలో కిరోసిన్‌పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆమెను భర్త కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందిందని దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+