పిల్లలతో ఫ్యామిలీ సూసైడ్: బయటపడిన తల్లి (పిక్చర్స్)
విశాఖపట్నం: అనారోగ్యం కారణంగా చనిపోతానంతే.. తనతోపాటు వస్తానని చెప్పాడు భర్త. అదే విధంగా చేశాడు. చనిపోవాలనుకున్న ఆమె మాత్రం బతికి బయటపడింది. భర్తతోపాటు ఇద్దరు పిల్లలు కూడా మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఆదివారం అర్ధరాత్రి విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో జరిగింది.
ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. తంగుడు శ్రీనివాసరావు (35) శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మిఠాయి వ్యాపారం నిర్వహిస్తూ భార్య పిల్లలతో జీవిస్తున్నాడు. అతనికి చరణ్‌దీప్ (4), చేతన్ (11 నెలలు) ఇద్దరు మగపిల్లలు. అతని భార్య వెంకటలక్ష్మి (26) ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. థైరాయిడ్ సమస్య తనను నిలవనీయడం లేదని చనిపోతానని భర్తతో ఆమె తరచూ చెప్పేది. అందుకు అతను 'నువ్వు లేకుండా నేను, పిల్లలు ఉండలేం, కలిసే చనిపోదాం' అన్నాడు.
భార్యకు అనారోగ్యంతోపాటు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఉదయం విశాఖనగరానికి వచ్చిన శ్రీనివాసరావు కుటుంబం రాత్రి వరకు ఆర్కే బీచ్‌లో గడిపింది. జనం పలుచబడిన తరువాత బీచ్‌లో జనం లేని చోటికి వెళ్లి పిల్లలిద్దరినీ భార్యాభర్తలిద్దరూ ఎత్తుకుని సముద్ర కెరటాల మధ్యకు వెళ్లారు. బలమైన కెరటం తాకిడికి భర్త, పిల్లలు సముద్రంలో గల్లంతయ్యారు. ఆమె మాత్రం ప్రాణాలతో ఒడ్డుకు కొట్టుకువచ్చింది.
అపస్మారక స్థితిలో వున్న ఆమెను అటుగా వచ్చిన వారు కెజిహెచ్‌కు తరలించారు. కాసేపటికి పదకొండు నెలల బాలుడి మృతదేహం కొట్టుకువచ్చింది. మంగళవారం తెల్లవారుజామున తండ్రీ, కొడుకుల మృతదేహాలు వైఎంసిఏ సమీపంలో ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. మృతదేహాలను మార్చురీకి తరలించారు. మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ అప్పలరాజు ఆధ్వర్యంలో ఎస్సై రామారావు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడు శ్రీనివాసరావు
తనతోపాటు వస్తానని చెప్పాడు భర్త. అదే విధంగా చేశాడు. చనిపోవాలనుకున్న ఆమె మాత్రం బతికి బయటపడింది. భర్తతోపాటు ఇద్దరు పిల్లలు కూడా మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఆదివారం అర్ధరాత్రి ఆర్కే బీచ్‌లో జరిగింది.

బయటపడిన వెంకటలక్ష్మి
తంగుడు శ్రీనివాసరావు (35) శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మిఠాయి వ్యాపారం నిర్వహిస్తూ భార్య పిల్లలతో జీవిస్తున్నాడు. అతనికి చరణ్‌దీప్ (4), చేతన్ (11 నెలలు) ఇద్దరు మగపిల్లలు.

మృతి చెందిన చిన్నారి చేతన్
శ్రీనివాసర్ భార్య వెంకటలక్ష్మి (26) ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. థైరాయిడ్ సమస్య తనను నిలవనీయడం లేదని చనిపోతానని భర్తతో ఆమె తరచూ చెప్పేది. అందుకు అతను 'నువ్వు లేకుండా నేను, పిల్లలు ఉండలేం, కలిసే చనిపోదాం' అన్నాడు.

మృతి చెందిన చిన్నారి చరణ్ దీప్
విశాఖ బీచ్‌లో జనం లేని చోటికి వెళ్లి పిల్లలిద్దరినీ భార్యాభర్తలిద్దరూ ఎత్తుకుని సముద్ర కెరటాల మధ్యకు వెళ్లారు. బలమైన కెరటం తాకిడికి భర్త, పిల్లలు సముద్రంలో గల్లంతయ్యారు. ఆమె మాత్రం ప్రాణాలతో ఒడ్డుకు కొట్టుకువచ్చింది.

బయటపడిన వెంకటలక్ష్మి
అపస్మారక స్థితిలో వున్న ఆమెను అటుగా వచ్చిన వారు కెజిహెచ్‌కు తరలించారు. కాసేపటికి పదకొండు నెలల బాలుడి మృతదేహం కొట్టుకువచ్చింది. మంగళవారం తెల్లవారుజామున తండ్రీ, కొడుకుల మృతదేహాలు వైఎంసిఏ సమీపంలో ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి.












Click it and Unblock the Notifications