ఇంజినీర్ హత్య కేసు: ముగ్గురు దోషులకు మరణశిక్ష

ఇరిగేషన్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న పి నాయక్‌ను అపహరించిన ఈ ముగ్గురు దోషులు, అతన్ని నల్గొండ జిల్లాలో 2011లో హత్య చేశారు. ఇంజినీర్ నాయక్‌కు సంబంధించిన ఆస్తుల కోసమే అతన్ని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆ ముగ్గురు దోషులు ఇంతకుముందు కూడా పలు తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ప్రకాశం, గుంటూరు, కర్నూలు, నల్గొండ జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా దొంగతనాలు, హత్యలకు పాల్పడ్డారని, వారిపై ఇప్పటికే 16 కేసులు నమోదయ్యాయని గుంటూరు పట్టణ ఎస్పి గోపినాథ్ జెట్టి తెలిపారు.
పలు కేసుల్లో దోషులైన వీరిపై పలు కోర్టుల్లో విచారణ కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఇంతకుముందు వీరు చేసిన నేరాలకు పదేళ్ల జైలు శిక్ష విధించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఇంజినీర్ హత్య కేసులో నేరం రుజువు కావడంతో కోర్టు వారికి మరణ శిక్షను విధించిందని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications