గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపిలో ఎదురుకాల్పులు: ముగ్గురు మావోల హతం

By Pratap
|
Google Oneindia TeluguNews

Three maoists killed in encounter
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య గురువారంనాడు ఎదురు కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమైనట్లు, మరో మావోయిస్టు పారిపోయినట్లు సమాచారం.

గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఈ ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం అందుతోంది. ప్రకాశం జిల్లా పుల్లెలచెరువు మండలం శతకోడు వద్ద పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. సంఘటనా స్థలంలో ఎకె 47, ఎస్ఎల్ఆర్, ఇతర సామాగ్రి లభ్యమైనట్లు సమాచారం. మృతి చెందిన మావోయిస్టులను జానా బాబూరావు, శారద, విమలక్కలుగా గుర్తించారు. జానా బాబూరావు డిప్యూటీ కమాండర్ అని తెలుస్తోంది. పోలీసులు మోస్ట్ వాంటెడ్ జాబితాలో జానా బాబూరావు ఉన్నట్లు చెబుతున్నారు.

ఎదురుకాల్పుల విషయాన్ని ఇటు గుంటూరు జిల్లా ఎస్పీ గానీ, అటు ప్రకాశం జిల్లా ఎస్పీ గానీ ధ్రువీకరించడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఈ స్థాయిలో ఎదురు కాల్పులు జరగడం ఇదే ప్రథమం

తాజా సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు పెరిగాయా అనే అనుమానాలకు తావిస్తోంది. నల్లమలలో దళాలను పెంచాలనే ప్రయత్నాల్లో జానా బాబూరావు ఉన్నట్లు చెబుతున్నారు.

English summary
According to media reports - three Maoists have been killed in an encounter with police in Prakasam district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X