జంట హత్యల కలకలం: బాబాయి, చిన్నారి కూతురు దారుణహత్య
గుంటూరు: వేమూరు నియోజక వర్గంలో జంట హత్యల కలకలం సృష్టించాయి. అమృతలూరు-పెదపూడి మధ్య రాపర్ల సతీష్(40) ,ఆతని ఆన్న కుమార్తె రాపర్ల చరిత(7)లను గుర్తు తెలియని దుండగులు దారుణంగా గొంతుకోసి హతమార్చారు. సోమవారం రాత్రి చరితతో కలిసి దీపావళి టపాసుల కోసం తెనాలి వచ్చిన సతీష్.. తిరిగి గ్రామానికి బైక్ ఫై వెళుతుండగా దారికాచి హత్యచేశారు దుండగులు.
కుటుంబ తగాదాలే కారణమని అనుమానం వ్యక్తమవుతున్నాయి. సతీష్ బాబు ఎరువుల వ్యాపారం చేస్తుంటాడు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చారు అనుకుంటున్నారు స్థానికులు. అయితే మృతదేహాల వద్ద బ్లేడు ముక్కలు కనిపిస్తున్నాయి.

ఆ బ్లేడు ముక్కలతో ఎవరైనా సతీష్ బాబు గొంతు కోసి పరారయ్యారా...? లేక సతీష్ బాబు గొంతుకోసుకొని మృతి చెందాడా...? అనేది అక్కడ పరిస్థితి బట్టి చూస్తె అనుమానం కలుగుతుంది. మరో ప్రక్క చిన్నారి చరిత మృత దేహాన్ని పరిశీలిస్తే చరిత గొంతు వాసి కమిలిపోయి ఉంది. దీనిని బట్టి చరిత ను గొంతు నులిమి చంపి, సతీష్ బాబు ని దుండగులు గొంతు కోసి చంపారని....? స్థానికులు అనుకుంటున్నారు. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు లో విషాదం: విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి
గుంటూరు జిల్లా రెంటచింతల మండల కేంద్రం లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఆమీర్ సెల్ షాప్‌లో ఉదయాన్నే షాపు తీసిన యజమాని షాపు కడిగేందుకు తన తమ్ముడు తో కలిసి సిద్ధమయ్యారు. షాపు మొత్తం సర్దుకుని కడుగుతున్న సమయంలో క్రింద ఉన్న విద్యుత్ వైర్లకు నీళ్లు తగిలాయి. దీంతో అక్కడ మొత్తం నీళ్లు ఉండటం తో విధ్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది.
దీంతో షాపు క్లీన్ చేసున్న షేక్ మస్తాన్ వలి(19) విద్యు షాకుతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రక్కనే ఉన్న షేక్ అమీర్(22) అతనికి కూడా విద్యుతు షాక్ తగిలింది.
అమీర్ షాక్ తో కోమాలోకి వెళ్ళాడు. ఇతనికి పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స అందిస్తున్నారు.
కొత్తగా పెళ్లైన యువకుడి మృతి
ఇది ఇలా ఉంటే చిలకలూరి పేటలో కొత్తగా పెళ్ళైన యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. నాదెండ్ల మండలం కనపర్రు లో ఈ విషాదం చోటుచేసుకుంది. 15 రోజుల క్రితం పెళ్లి అయిన 22 సంవత్సరాల మహేంద్ర ఇంటి పనులు చేస్తూ విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు.
బైక్ చక్రంలో చీర చుట్టుకుని.... మహిళ మృతి
కృష్ణా: ప్రమాదం ఏ రూపంలో అయినా ఎదురు కావచ్చు.. మృత్యువు ఎలాగైనా రావచ్చు... ఇలాంటి అనుకోని ఘటనే చల్లపల్లిలో జరిగింది. ద్విచక్ర వాహనం చక్రంలో చీర చుట్టుకుని ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కృష్ణాజిల్లా భావదేవరపల్లికి చెందిన అరజా ఝాన్సి (64) భావదేవరపల్లి నుంచి అవనిగడ్డ వైపు బైక్‌పై వస్తున్నది.
అయితే దురదృష్టవశాత్తు 9వ వార్డు పెట్రోల్ బంకు వద్దకు రాగానే చక్రంలో చీర చుట్టుకుపోవడంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. బైక్ నడుపుతున్న వ్యక్తి ఝాన్సి మృతదేహం దగ్గర కూలబడి కన్నీటి పర్యంతమయ్యాడు. సంఘటనాస్థలంలో పోగైన జనం ప్రమాదం గురించి తెలుసుకుని కంటతడి పెట్టారు. చీర, చుడీదార్ ధరించి దిచక్రవాహనాలపై ప్రయాణించే మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రమాదం సూచిస్తోందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications