తిరుమల లడ్డూ వివాదం: డ్యామిడ్.. చంద్రబాబు కథ అడ్డం తిరిగింది!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డు కల్తీ జరిగిందని చేసిన వ్యాఖ్యల దుమారం నేటికీ కొనసాగుతూనే ఉంది . తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయుధం ఇచ్చినట్లుగా మారింది. తిరుమల లడ్డూ విషయంలో డ్యామిడ్ చంద్రబాబు కథ అడ్డం తిరిగింది.

చంద్రబాబును టార్గెట్ చేసిన వైసీపీ
తిరుమల లడ్డు కల్తీ పై చేపట్టిన విచారణలో సుప్రీం ధర్మాసనం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను చాలా తీవ్రంగా పరిగణించడం, దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచమని వ్యాఖ్యానించడం, కల్తీ నెయ్యి విషయంలో ప్రభుత్వానికి ఆధారాలు కావాలంటూ పలు ప్రశ్నలు సంధించడంతో ఇప్పుడు వైసీపీ చేతికి అది ఆయుధంగా మారింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందువుల మనోభావాలను దెబ్బతీసింది చంద్రబాబు అంటూ చంద్రబాబును టార్గెట్ చేస్తుంది.

Tirumala Laddu Controversy ycp weapon with supreme court comments on Chandrababu

ఎక్స్ ఖాతాలో వైసీపీ పోస్ట్
వైసిపి ఎక్స్ అధికారిక ఖాతాలో దీనిపైన స్పందిస్తూ తిరుమల లడ్డు విషయంలో నోరు జారిన చంద్రబాబు పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, కల్తీ నెయ్యి వాడినట్టు సరైన ఆధారాలు లేకపోయినా చంద్రబాబు బహిరంగ ప్రకటన చేయడం పైన మండిపడిందని పేర్కొంది. రాజ్యాంగ పరిధిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా అంటూ సుప్రీం ధర్మాసనం చంద్రబాబుకి అక్షింతలు వేసిందని పేర్కొంది.

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
కనీసం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది. ఇక సత్యమేవ జయతే అంటూ ఒక పోస్టును కూడా పెట్టి చంద్రబాబును టార్గెట్ చేసింది. ఇక తిరుమల ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వరస్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

సుప్రీం ప్రశ్నలకు సమాధానం చెప్పు చంద్రబాబు.. నిలదీసిన మాజీ మంత్రి
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం స్థాయి వ్యక్తి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టిందని, కల్తీ నెయ్యి పైన సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది అని, జూలై 23 నుంచి సెప్టెంబర్ 18వరకు ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు ఇప్పుడు ఎందుకు మాట్లాడారు అన్న విషయాన్ని కూడా సుప్రీం ధర్మాసనం నిలదీసిందని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సుప్రీం ప్రశ్నలకు సమాధానం చెప్పు చంద్రబాబు అని ప్రశ్నించారు.

సుప్రీం జడ్జితో పూర్తి విచారణ జరగాలని డిమాండ్
కల్తీ నెయ్యి వ్యవహారంలో వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని, అసలు ఈ మొత్తం వ్యవహారం పైన సుప్రీంకోర్టు జడ్జి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అటు సుప్రీం ధర్మాసనం మాత్రమే కాదు తాము కూడా భగవంతుని రాజకీయాల్లోకి లాగొద్దని చెబుతున్నామని చంద్రబాబుకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+