TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఆన్ లైన్ లో టిక్కెట్లు

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలకు ఒక్కసారైనా వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి హిందువు ఆశపడుతుంటారు. శ్రీవారి దర్శనం కోసం ఆన్ లైన్ టికెట్లు బుక్ చేసుకోవడానికి భక్తులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటారు. కొన్ని నెలలు ముందుగానే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఆన్ లైన్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు.

టీటీడీ అధికారులు రూ. 300 రూపాయల టికెట్లు, ప్రత్యేక సేవా టికెట్లు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారు అని భక్తుల ఎదురు చూస్తుంటారు. తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లు సంబంధించి 2025 జనవరి నెల కోటాను అక్టోబర్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబర్ 21వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవడానికి టీటీడీ అవకాశం కల్పించింది.

Tirumala Srivari Arjita Seva tickets are released online by TTD

ఈ టికెట్లు పొందిన వారు అక్టోబర్ 21వ తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లించిన వారికి లక్కీ డిప్ లో టికెట్లు మంజూరు అవుతాయని టీటీడీ తెలిపింది. అక్టోబర్ 22వ తేదీన ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, అర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్త్రదీపాలంకరణ సేవా టికెట్లు విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 22వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు పర్సువల్ సేవలు వాటి దర్శన స్లాట్స్ కు సంబంధించి జనవరి నెల కోటాను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు.

అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి జనవరి నెల కోటాను విడుదల చేస్తున్నారు. 2025 జనవరి నెల కు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లను అక్టోబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేస్తోంది. తిరుమల, తిరుపతిలోని టీటీడీ గదుల జనవరి నెల కోటాను అక్టోబర్ 24వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. 2025 జనవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి సేవా టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నామని, భక్తులు ఈ విషయం గమనించాలని టీటీడీ బుధవారం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+