రికార్డ్ సృష్టించిన తిరుపతి ఎయిర్‌పోర్ట్.. మొదటిసారి 10లక్షలమంది ప్రయాణికులు!
ఏపీలోని తిరుపతి రేణిగుంట విమానాశ్రయం కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల సంఖ్య బాగా పెరుగుతున్న క్రమంలో తిరుపతి ఎయిర్ పోర్ట్ ప్రయాణికులకు విస్తృతంగా సేవలు అందిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే పర్యాటకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు, ఇతర పనులతో వచ్చే వారితో తిరుపతి ఎయిర్పోర్ట్ బిజీగా ఉంటుంది. అత్యధిక సంఖ్యలో ప్రయాణికులను ఆకర్షిస్తోంది.
తిరుపతి విమానాశ్రయంలో ఏకంగా 10లక్షల మంది ప్రయాణికులు
ఈ ఆర్థిక సంవత్సరంలో 2025- 26 జనవరి వరకు తిరుపతి విమానాశ్రయం ద్వారా ఏకంగా 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వీరిలో ఎక్కువమంది తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులు కాగా, ఈ విమానాశ్రయంలో మరిన్ని విమాన సేవలను పెంచాలని కూడా ఏవియేషన్ శాఖ భావిస్తోంది.

ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి 11లక్షలు దాటవచ్చని అంచనా
గత ఆర్థిక సంవత్సరంలో తిరుమల శ్రీవారిని 9.9 లక్షల మంది ప్రయాణికులు దర్శించుకుంటే ఈ ఏడాది ఆ సంఖ్య ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి 11లక్షలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. విమానయాన సంస్థలు 72 సీట్ల చిన్న విమానాల స్థానంలో, ప్రస్తుతం 230 సీట్ల పెద్ద ఎయిర్ బస్సులను నడుపుతున్నాయి. ఇక ప్రతిరోజు తిరుపతికి 16 విమాన సర్వీసులు ఉదయం నుండి సాయంత్రం వరకు నడుస్తున్నాయి.
నెలకు దాదాపు లక్ష మందికి పైగా ప్రయాణికుల అంచనాలు
ఇవి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు చాలా ఉపయోగంగా ఉన్నాయి. ఇక ఇదే సమయంలో టిటిడి ఎయిర్పోర్టులో శ్రీవాణి టికెట్లు జారీ చేస్తున్న కారణంగా కూడా ప్రయాణాలు చేస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది.నెలకు దాదాపు లక్ష మందికి పైగా ప్రయాణికుల అంచనాలతో ఎయిర్పోర్టు పరిసరాలలో కీలక అభివృద్ధి పనులు చేయనున్నారు.
తిరుమలకు వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించడం కోసం ప్రతిపాదన
హోటల్స్, రెస్టారెంట్లు వంటి వాటిని ఏర్పాటు చేసి తిరుమలకు వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించడం కోసం ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా దక్షిణాదిలో తిరుపతి విమానాశ్రయం అతి పెద్ద రన్ వేతో ఉన్న ఎయిర్ పోర్ట్. హైదరాబాదు లోని రన్ వేల కంటే తిరుపతి రన్ వే చాలా విశాలమైనది. అటువంటి తిరుపతి విమానాశ్రయాన్ని భవిష్యత్తులో మరిన్ని దేశీయ, విదేశీ విమానాలను నడపడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
-
శ్రీవారి దర్శనం టికెట్ల బుకింగ్స్‌లో కీలక మార్పులు, ఇక సులభంగా..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications