టాయిలెట్స్ ఫస్ట్, తర్వాతే మొబైల్స్: చంద్రబాబు
విశాఖపట్నం: అత్యాధానికమైన మొబైల్ ఫోన్స్ వాడుతారు గానీ ఇళ్లలో టాయిలెట్లు ఎందుకు నిర్మించుకోరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం జిల్లా గండవరం గ్రామంలో ఆయన ఆ ప్రశ్న వేశారు.
పారిశుధ్యం బాగా లేదని, టాయిలెట్లు లేవని గ్రామస్థులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దానికి చంద్రబాబు ప్రతిస్పందిస్తూ సెల్‌ఫోన్లు ఉన్నవారంతా చేతులెత్తండి అంటడూ అడిగారు. చాలా మందికి సెల్ ఫోన్లు ఉన్నాయని తెలిసిపోతూ ఉందని, కొందరికి రెండు సెల్ ఫోన్లు కూడా ఉండి ఉంటాయని, ఒకటి కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి, మరోటి మిత్రులతో బయటివారితో మాట్లాడడానికి వాడుతారని చంద్రబాబు అన్నారు.

ఒక్కొక్కరు రెండు సెల్‌ఫోన్లు వాడడానికి సిద్ధపడ్డవారు ఇంట్లో కనీసం టాయిలెట్లు ఎందుకు నిర్మించుకోరని అడిగారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి టాయిలెట్లు అనివార్యమని చంద్రబాబు అన్నారు. ఉత్తమ జీవన ప్రమాణాల కోసం తమ ప్రభుత్వం టాయిలెట్లు నిర్మించడానికి కట్టుబడి ఉందని చెప్పారు.
అమ్మాయిలు టాయిలెట్లు లేని ఇంట్లో నుంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దని సూచించారు. అత్యంత అవసరమైన టాయిలెట్లు లేని ఇంట్లోంచి అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు నిరాకరించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications