Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆనందయ్య మందువాడాను.. ఆనందంగా ఉన్నాను: జగపతి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే గాక, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వేలాది మంది తీసుకొన్నవారు తమకు ఆరోగ్యవంతులమయ్యామని చెబుతున్నారు. కానీ, మరికొందరు మాత్రం ఇలాంటి మందులను వాడకూడదని చెబుతున్నారు. అయితే, మెజార్టీ ప్రజలు మాత్రం ఆనందయ్య మందుకు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆనందయ్య మందుకు అనుమతిచ్చింది. కంట్లో వేసే మందు మినహా ఇతర మందులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆయుర్వేదం హానీ చేయదు..

ఆయుర్వేదం హానీ చేయదు..

ఇప్పటికే చాలా మంది ఆనందయ్య మందును వేసుకుని కోలుకున్న విషయం తెలిసిందే. పలువురు కరోనాను కూడా జయించామని చెబుతున్నారు. దీంతో చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి వచ్చి ఇక్కడ మందు తీసుకుంటుండటం గమనార్హం. తాజాగా, ప్రముఖ జగపతి బాబు కూడా ఆనందయ్య మందుపై స్పందించారు. తాను ఆనందయ్య మందును ఎప్పుడు తీసుకున్నానని, ఆయుర్వేదం హాని చేయదని తాను బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు.

ఆనందయ్య మందు వాడాను.. కరోనా దరిచేరలేదు

ఆనందయ్య మందు వాడాను.. కరోనా దరిచేరలేదు


జగపతి బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఆనందయ్య ఆయుర్వేద మందుని వాడిన వారిలో తాను ఒకడినని, తనకు కరోనా రాలేదన్నారు. ఆయుర్వేదం మందులను ప్రకృతి ఇచ్చిన సహజమైన ఔషధాలతో తయారు చేస్తారని, అలాంటి మందు ఎలాంటి హానీ చేయదన్నారు. ప్రకృతి, భూమాత తప్పు చేయదని చెప్పారు. ఆనందయ్య మందు విషయంలో చాలా మంది అభిప్రాయాలు చూశానని, రకరకాల వీడియోలు చూసిన తర్వాత ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు.

ప్రజలను కాపాడేందుకే ఆనందయ్య మందు..

ప్రజలను కాపాడేందుకే ఆనందయ్య మందు..

ఎవరేమన్నా.. ఈ ఆయుర్వేద మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవని.. ఖచ్చితంగా మంచే జరుగుతుందని తాను ఆనందయ్య మందును వాడినట్లు జగపతి బాబు తెలిపారు. అదృష్టవశాత్తు తనకు ఇప్పటి వరకు కరోనా రాలేదని, తాను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నానని అన్నారు. ఇంతకుముందు కూడా జగపతిబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజలను కాపాడేందుకు ప్రకృతి ఆనందయ్య రూపంలో ప్రపంచానికి మందును అందించి కాపాడుతోందన్నారు. హైకోర్టు, ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో ప్రజలకు మందు పంపిణీ చేసేందుకు ఆనందయ్య ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్ ద్వారా హోండెలివరీ చేసేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+