జగన్ తమ్ముడి పేరు చెప్పేసిన సాయిరెడ్డి-ధర్డీ ఇయర్స్ పృధ్వీ ట్వీట్..!

ఏపీ రాజకీయాల్లో ధర్డ్ ఇయర్స్ ఇండస్ట్రీ గా పాపులర్ అయిన టాలీవుడ్ కమెడియన్ పృథ్వీ గతంలో వైసీపీలో పనిచేశారు. ఆ తర్వాత కూటమిలో చేరి వైసీపీలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. గత ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన పృథ్వీ వరుసగా వైసీపీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఓ ఆరోపణను ప్రస్తావిస్తూ ట్వీట్ పెట్టారు. ఇందులో జగన్ ను లింక్ చేశారు.

నిన్న విజయవాడలో సీఐడీ విచారణకు హాజరైన పృథ్వీ కాకినాడ పోర్టు వాటాల వ్యవహారంలో వాంగ్మూలం ఇచ్చారు. కాకినాడ పోర్టు వాటాల్ని కేవీ రావు నుంచి అరబిందోకు బలవంతంగా బదలాయించుకున్న కేసులో తన ప్రమేయం లేదని, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డే దీనికి కర్త, కర్మ, క్రియ అని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఇదే విషయం సీఐడీకి కూడా చెప్పానన్నారు. ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ పృథ్వీ ట్వీట్ పెట్టారు.

Tollywood comedian prudhvi misquoted yv subbareddy s son vikrant reddy as ys jagan s brother

అంతవరకూ బాగానే ఉన్నా విక్రాంత్ రెడ్డిని వైఎస్ జగన్ సోదరుడంటూ బ్రాకెట్ లో పెట్టారు. వాస్తవానికి జగన్ కూ, విక్రాంత్ రెడ్డికీ నేరుగా సంబంధం లేదు. అయితే వైవీ సుబ్బారెడ్డి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తోడల్లుడు కావడంతో ఆయన కుమారుడు, జగన్ ఇద్దరూ అన్నదమ్ములవుతారనే అర్ధంలో ఆయన ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే ట్వీట్ లో పృథ్వీ .. రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకోవాలో వైఎస్సార్సీపీ కి తెలిసినట్టు ఎవ్వరికి తెలియదు .. Ycp సింగిల్ పాలసీ "దోచుకో దాచుకో " అని చెప్పుకొచ్చారు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+