పుష్కరాల్లో ధరల మంట: వాటర్ ప్యాకెట్ రూ.5, కొబ్బరికాయ రూ.30 (ఫోటోలు)
రాజమండ్రి: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతున్న పుష్కర స్నానాల కోసం వస్తున్న భక్తులకు స్ధానికంగా ఉన్న ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మంచినీరు ప్యాకెట్ నుంచి పుష్కురుని మొక్క కోసం కొనుగోలు చేసే పూజా సామాగ్రి వరకు ధరలు మండిపోతున్నాయి.
ఆ ధరలను చూసిన భక్తులు మొక్కులు తీర్చుకోలేక బెంబేలెత్తుతున్నారు. లగేజీ అదనపు భారమవుతుందనే భావనతో కొంత మంది భక్తులు స్వస్థలాలనుంచి పూజాసామాగ్రి, తాగునీళ్ళు వెంటతెచ్చుకోకుండా, స్థానికంగానే కొనుగోలు చేద్దామని అనుకునే వారికి అక్కడి ధరలను చూసి హాడలిపోతున్నారు.

పుష్కరాల్లో ధరల మంట
వాటర్ పాకెట్ ధర ర.5, బాటిల్ ధర రూ.30, కొబ్బరికాయల ధరలు రూ. 30, ఒక్క టీ ధర రూ.10, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వస్తువుకు వాస్తవధరకు మూడింతలు అదనంతో అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

పుష్కరాల్లో ధరల మంట
దీంతో చేసేది లేక భక్తులు ధర ఎంతున్నా కొనుగోలు చేస్తున్నారు. భక్తుల అవసరాన్ని స్థానికులు క్యాష్ చేసుకుంటుండగా, తమకు తిరుగుప్రయాణానికి డబ్బులు సరిపోతాయో లేదోననే ఆందోళన వ్యక్తంచేయటం గమనార్హం.

పుష్కరాల్లో ధరల మంట
జిల్లాలోని పుష్కరఘాట్లున్న ప్రతిచోట ఇదేపరిస్థితి నెలకొనగా, పుష్కరస్నానంలో పుణ్యతిధికన్నా సామాగ్రి కొనుగోలుకే అధిక ఖర్చు అవుతుండటం భక్తులను ఇబ్బందుల పాలుచేస్తోంది.

పుష్కరాల్లో ధరల మంట
తాము అంచనా వేసుకుని తెచ్చుకునే మొత్తం కేవలం ఘాట్‌వరకు వచ్చి స్నానాలు, దైవదర్శనం వరకు మాత్రమే సరిపోతుండగా, అత్యధికమంది తమ ఎటిఎంలు, ఇతరత్రా తిరిగి వినియోగిస్తున్నారు.

పుష్కరాల్లో ధరల మంట
సోమ, మంగళవారాల్లో రాష్టవ్య్రాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.

పుష్కరాల్లో ధరల మంట
దీంతో ఇప్పుడున్న ఏర్పాట్లను మరింతగా విస్తరిస్తోంది. పుష్కరాలకు వచ్చే భక్తులంతా కోటిలింగాలు, పుష్కర ఘాట్‌లకు వెళుతున్నారు. రాజమండ్రిలో ఎండల తీవ్రంగా ఉండడంతో భక్తుల కోసం కంపార్ట్‌మెంట్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

పుష్కరాల్లో ధరల మంట
తిరుమల మాదిరిగా ఇక్కడ కూడా కంపార్ట్‌మెంట్ సౌకర్యాన్ని అమలు చేయనున్నారు. ఈ కంపార్ట్‌మెంట్లలో కోటిలింగాలు, పుష్కర ఘాట్‌లలో మాత్రమే ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలియచేశారు.

పుష్కరాల్లో ధరల మంట
ఇదిలా ఉండగా సోమవారం నుంచి రాజమండ్రిలో లక్ష ఉచిత ఆహార పొట్లాలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా పుష్కర యాత్రికులకు ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తోంది.

పుష్కరాల్లో ధరల మంట
అలాగే మజ్జిగ, మంచినీళ్ళు విరివిగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా భక్తుల సేవల్లో తరించబోతున్నారు. వారికి ఒక డ్రస్ కోడ్ కూడా ఇచ్చారు.

పుష్కరాల్లో ధరల మంట
కార్యకర్తలు భక్తుల తాకిడిని నియంత్రించనున్నారు. అలాగే వారు కూడా నీళ్ళు, మజ్జిగ పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ అదనంగా మరికొన్ని రైళ్ళ నడుపుతోంది.












Click it and Unblock the Notifications