దీపావళి వేళ ఏపీలో విషాదం.. బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగుపాటు, ఇద్దరు మృతి!

దీపావళి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. దీపావళి పండుగ ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలు సిద్ధమవుతున్న వేళ ఊహించని విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బాణసంచా తయారీ కేంద్రం సమీపంలో పిడుగు పడి ఒక్కసారిగా బాణా సంచా తయారీ కేంద్రంలో మంటలు ఎగసి పడ్డాయి.

బాణా సంచా తయారీ కేంద్రంపై పిడుగుపాటు
బాణా సంచా తయారీ కేంద్రం పై పిడుగు పాటు ధాటికి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈరోజు తూర్పు గోదావరి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న నేపధ్యంలో ఒక్కసారిగా పిడుగులు పడటంతో ఊహించని ఘోరం చోటు చేసుకుంది. పిడుగు పడటంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా బాణా సంచా పేలుడు సంభవించింది.

Tragedy in AP on Diwali thunderbolt strike on fireworks manufacturing center two killed

ఇద్దరు మృతి, 10 మందికి గాయాలు
ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన ఇద్దరు మహిళలు బాణా సంచా తయారీ కేంద్రంలో పని చేస్తున్న వారిగా తెలుస్తుంది. ఒక్కసారిగా బాణా సంచా తయారీ కేంద్రంలో పిడుగు పడటంతో అక్కడ పని చేస్తున్న కూలీలు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ఈ ఘటనలో 10మంది గాయపడ్డారు. గాయపడిన వారిని తణుకు ఆస్పతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
ప్రస్తుతం అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటన పైన ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బాణసంచా తయారీ కేంద్రం సమీపంలో పిడుగుపాటు ధాటికి ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్
మృతుల కుటుంబాలకు వైయస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంటలు చెలరేగి గాయాల పాలైన బాధితులకు తక్షణమే మైరుగైన వైద్యసదుపాయాలు అందించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+