తెలంగాణలో ముఖ్యనేతల ఇలాకాల్లో ఇతర పార్టీల పాగా

ఇక్కడ ఐదు మండలాలు ఉండగా, ఒక్క జడ్పీటీసీ స్థానాన్ని మాత్రమే టిడిపి సాధించింది. మూడు స్థానాల్లో కంగ్రెస్ పాగా వేయగా ఒక స్థానాన్ని తెరాస గెలిచుకుంది. ఎంపీపీ పీఠాల్లో ఏ ఒక్కటీ టిడిపికి దక్కలేదు. నియోజకవర్గ పరిధిలోని కొడకండ్ల, తొర్రూరు ఎంపీపీ పీఠాలను తెరాస కైవసం చేసుకుంటే, దేవరుప్పుల మండల పరిషత్‌లో కాంగ్రెస్ గెలుచుకుంది.
టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఎమ్మెల్యేగా పోటీ చేసిన జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండగా 4 జడ్పీటీసీ స్థానాలను తెరాస చేజిక్కించుకుంది. ఒక్క స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ దక్కించుకుంది. నియోజకవర్గ పరిధిలోని చేర్యాల, బచ్చన్నపేట, నర్మెట్ట ఎంపీపీ పీఠాలు కూడా తెరాస వశమయ్యాయి.
మాజీ మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహించిన మంథని అసెంబ్లీ నియోజకవర్గంలోని 9 జడ్పీటీసీ స్థానాల్లో ఐదింటిని తెరాస, రెండు స్థానాలను కాంగ్రెస్ గెలిచాయి. నియోజకవర్గంలోని 7 మండలాల్లో రెండు ఎంపీపీ స్థానాలను తెరాస సాధించింది. ఆదిలాబాద్ పార్లమెంట్ తెరాస అభ్యర్థి గెడ్డం నగేష్ స్వగ్రామం జాతర్లలో టిడిపి అభ్యర్థి విజయబావుటా ఎగురవేశారు.
కాగా, టిపిసిసి ప్రచార కమిటీ సారథి రాజనర్సింహ ఎమ్మెల్యేగా పోటీ చేసిన మెదక్ జిల్లా అంథోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉండగా ఆరు జడ్పీటీసీ కాంగ్రెస్, ఒకచోట టిడిపి గెలిచాయి. అల్లాదుర్గంతోపాటు, అంథోల్ ఎంపీపీ పీఠాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి దక్కించుకుంది.












Click it and Unblock the Notifications