ఏ హోదాలో కిరణ్ స్పీచ్: మాకు సంబంధం లేదని జానా

కిరణ్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా లేక సభా నాయకుడిగా మాట్లాడుతున్నారా చెప్పాలని జానా రెడ్డి కోరారు. దీంతో తెరాస సభ్యులు వీ వాంట్ క్లారిఫికేషన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. సభాపతి నాదెండ్ల మనోహర్ పదేపదే సభ్యులకు అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తెరాస సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.
ఈ సమయంలో ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఆ కుర్చీలో ముఖ్యమంత్రి కూర్చుంటారని, ఏ హోదాలో మాట్లాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. అయినప్పటికీ తెరాస ఆందోళన తగ్గలేదు.
అనంతరం జానా రెడ్డి మాట్లాడుతూ... ఏ హోదాలో మాట్లాడుతున్నారో చెప్పాలని కోరామని, వారు సభా నాయకుడిగా మాట్లాడితే అందులో తాము భాగంకామని చెప్పేందుకే క్లారిఫికేషన్ అడిగానన్నారు. కిరణ్ నిర్ణయం సభ మొత్తానికి సంబంధించినది కాదన్నారు. 'ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తున్నాం' అన్న వ్యాఖ్యల పైనే తాను వివరణ అడిగానన్నారు. అదే సమయంలో తెరాస సభ్యులను సముదాయించారు.












Click it and Unblock the Notifications