క్షమాపణ: మట్టి బొమ్మలు Vs ఎన్టీఆర్‌పై చెప్పులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు మట్టి బొమ్మల వ్యాఖ్యలపై ఐదు నిమిషాల అనంతరం శాసన సభ ప్రారంభమయ్యాక కూడా కాసేపు గందరగోళం ఏర్పడింది. ట్యాంకుబండు పైన విగ్రహాలను మట్టి విగ్రహాలు అన్నందుకు కెటిఆర్ క్షమాపణలు చెప్పాలని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నినాదాలు చేసింది.
దీనిపై కెటిఆర్ స్పందిస్తూ.. తాము మహనీయులకు వ్యతిరేకం కాదని కానీ, తెలంగాణ కోసం అంతమంది విద్యార్థులు చనిపోతే, తెలంగాణ తల్లులు కంట నీరు పెట్టినప్పుడు ఈ సభ ఎందుకు భరోసా ఇవ్వలేదని ప్రశ్నించారు. ట్యాంకుబండు విగ్రహాలను ఏర్పాటు చేసిన కమిటీలో కెసిఆర్ సభ్యుడైనప్పటికీ ఈ సీమాంధ్ర ప్రభుత్వాల్లో తెలంగాణ మంత్రులకు, నాయకులకు స్వేచ్ఛ లేదన్నారు.

దూళిపాళ్ల స్పందన
ట్యాంకుబండు పైన కేవలం సీమాంధ్ర వారి విగ్రహాలే లేవని, రుద్రమదేవి, సురవరం, మొయినుద్దీన్, తానిషా, బమ్మెర పోతన వంటి వారి విగ్రహాలు ఉన్నాయన్నారు. విగ్రహాల కమిటీకి సి నారాయణ రెడ్డి చైర్మన్ అయితే, కెసిఆర్ సభ్యులుగా ఉన్నారన్నారు. మట్టి బొమ్మల వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పేందుకు ముందుకు రాకపోతున్నారంటే ఇది వారి సంస్కారమన్నారు. కొమరం భీమ్, చాకలి ఐలమ్మ విగ్రహాల గురించి మాట్లాడుతున్న వారు వారు అధికారంలో లేదా అధికార పక్షాన ఉన్నప్పుడు ఎందుకు డిమాండ్ చేయలేదన్నారు. ఇప్పుడు మభ్య పెట్టేందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శాసన సభ సాక్షిగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరామన్నారు.
కెటిఆర్ కౌంటర్
బతికి ఉన్న వారికి సమాధి కట్టే వారి నుండి సంస్కారం నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు. బతికుండగానే ఎన్టీఆర్ పైన చెప్పులు వేయించిన దుర్మార్గులు, వీరు సంస్కారం గురించి మాట్లాడుతారా అన్నారు. ఎన్టీఆర్ పైన చెప్పులు వేయించినందుకు, తెలంగాణపై ఇచ్చిన మాటపై వెనక్కి పోయినందుకు చంద్రబాబుతో క్షమాపణలు చెప్పించి ఆ తర్వాత తన క్షమాపణ అడగాలన్నారు. దానికి టిడిపి స్పందిస్తూ.... ఎన్టీఆర్ పైన చెప్పులు వేయించారని కెటిఆర్ అనడం విడ్డూరమని, అప్పుడు కెసిఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications