TTD: తిరుమల క్యూలైన్లలో ఆకస్మిక తనిఖీలు, శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
Tirumala: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీలో శరవేగంగా మార్పులు, చేర్పులు జరిగిపోయాయి. తిరుమలకు వెళ్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా టీటీడీ అనేక చర్యలు తీసుకుంటుంది. తిరుమల శ్రీవారి భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్లలో వేచి చూడకుండా వాళ్లు త్వరగా శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేలా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
గత ప్రభుత్వంలో వచ్చిన ఆరోపణలు కూటమి ప్రభుత్వంలో రాకూడదని చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి శనివారం వేకువ జామున తిరుమలలోని క్యూ లైన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ -2, నారాయణగిరి ఉద్యానవనం షెడ్లు, కృష్ణ కృష్ణ తేజ సర్కిల్ ప్రాంతాల్లోని క్యూ లైన్ లను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

కృష్ణ తేజ సర్కిల్లో భక్తులలు క్యూలైన్లలోకి ప్రవేశించే మార్గంలో కొందరు ప్రైవేటు టాక్సీ, జీప్ డ్రైవర్లు అడ్డంగా పార్కింగ్ చేస్తున్నారని పలువురు శ్రీవారి భక్తులు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తామని భక్తుకు ఆయన హామీ ఇచ్చారు. అనధికారిక పార్కింగ్ నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాలు జారీ చేశారు.
పోలీసులు కూడా కృష్ణతేజ సర్కిల్ లో కార్లు, జీపులు అడ్డంగా పార్కింగ్ చేయకుండా చూసుకోవాలని, శ్రీవారి భక్తులు సవ్యంగా క్యూలైన్లలో వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులకు వెంకయ్య చౌదరి ఆదేశాలు జారీ చేశారు. క్యూలైన్లలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో మాట్లాడిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
శనివారం ఉదయం టీటీడీ అందించిన ఉప్మా ఎలా ఉందని శ్రీవారి భక్తులను ఆయన అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అందిస్తున్న అల్పాహారం, పాలు రుచిగా ఉన్నాయా, లేదా అని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి భక్తులను అడిగి తెలుసుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్నప్రసాదాలు, తాగునీరు ఎప్పటికప్పుడు అందుతున్నాయా, లేదా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు.
ADDITIONAL EO INSPECTS OUTSIDE QUEUE LINES
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) August 24, 2024
With the weekend pilgrim rush at Tirumala, the Additional EO of TTD, Sri Ch. Venkaiah Chowdhary, conducted sudden inspections during the early hours of Saturday. pic.twitter.com/AmKqALkAhm
ఇదే సమయంలో వైకుంఠములో ఏ సమయంలో అల్పాహారం, అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ అందిస్తారు అనే పూర్తి వివరాలతో క్యూకాంప్లెక్స్ ల్లో డిస్లే బోర్డుల్లో భక్తులకు వివరాలు తెలపాలని సంబంధిత అధికారులకు వెంకయ్య చౌదరి ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, ఆ దిశగా మార్పులు చెయ్యాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ శ్రీవారి భక్తులు ఎక్కువ సమయం అక్కడ వేచి ఉండకుండా చూసి త్వరగా దర్శనానికి పంపించేలా ఏర్పాట్లు చేయాలని టీటీడీ సిబ్బందికి అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాలు జారీ చేశారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో పరిశుద్ధ పనులు మెరుగు పరచాలని, భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా చూసుకునే బాధ్యత మనపై ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications