TTD: టీటీడీ బోర్డు భేటీ, భక్తుల కోసం ఇక - బ్రేక్ దర్శనాలపై కీలక నిర్ణయం..!!

Tirumala: తిరుమల రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతోంది. మినీ బ్రహ్మోత్సవంగా భావించే ఈ ప్రత్యేక ఉత్సవానికి దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా. దీనికి తగిన విధంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమి నాడు శ్రీవారు సప్త వాహనాల పై భక్తులకు మాడ వీధు ల్లో దర్శనం ఇవ్వనున్నారు. కాగా, ఈ రోజు టీటీడీ పాలక మండలి ప్రత్యేకంగా సమావేశం కానుంది. రథసప్తమి ఏర్పాట్లు.. భక్తుల రద్దీ.. తాజా నిర్ణయాల పైన సమీక్షించనుంది. బ్రేక్ దర్శనాల పైన కీలక నిర్ణయం తీసుకున్నారు.

బోర్డు ప్రత్యేక భేటీ
టీటీడీ పాలక మండలి బోర్డు ఈ రోజు (శుక్రవారం) ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఫిబ్రవరి 4న రథసప్తమి వేడుకల పైన ప్రత్యేకంగా సమీక్ష చేయనుంది. ఇప్పటికే అధికారులు రథసప్తమి కోసం కార్యాచరణ సిద్దం చేసారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తరువాత పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే కార్యక్రమాల నిర్వహణ పైన టీటీడీ బోర్డు ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. తిరుపతి లాంటి ఘటనలకు ఇక అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఈ రోజు సమావేశంలో ఏర్పాట్ల పైన అధికారుల నుంచి సమాచారం సేకరించనున్నారు. రథ సప్తమి వేళ తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేస్తోంది. అదే సమయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనంలో మార్పులు చేసింది. బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

TTD board to meet today over Rathasaptami Arrangements and review latest decisions

రథసప్తమి వేళ
తిరుమలలో నిర్వహించే శ్రీవారి ఉత్సవాల్లో రథసప్తమి కీలకమైనది. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారి ఆలయానికి తరలి వస్తారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 4న ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభ మవుతాయి. అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనసేవతో శ్రీమలయప్ప స్వామివారి వాహన సేవలు ముగుస్తాయి. రథ సప్తమి నాడు శ్రీవారికి వాహన సేవ నిర్వహించనున్నారు. ఉదయం 5.30 గంటకలు సూర్యప్రభ వాహన సేవ, 9 గంటలకు చిన్నశేష వాహన సేవ, 11 గంటలకు గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. మధ్నాహ్నం 1 గంటకు హనుమంత వాహన సేవ,2గంటలకు చక్రస్నానం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, 6 గంటలకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు - చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారని టీటీడీ వెల్లడించింది.

బ్రేక్ దర్శనాలు రద్దు
రథసప్తమి సందర్భంగా ప్రివిలేజ్ దర్శనాలు, పలు సేవలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసు కుంది. అష్టాదళ పాదపద్మారాధన, ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేసారు. ఎన్‌ఆర్‌ఐలు, సీనియర్ సిటిజన్లు, చంటి బిడ్డల తల్లిదం డ్రులు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతిలో వచ్చే నెల 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయటం లేదని ప్రకటించారు. ఇక, ప్రోటో కాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి వచ్చే నెల 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరని టీటీడీ అధికారులు తెలిపారు. అదే విధంగా టీటీడీలో భక్తుల సౌకర్యాల పెంపు దిశగా తీసకోవాల్సిన నిర్ణయాల పైన నేటి టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి ఆమోదించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+