
TTD: తిరుమలలో సూర్యప్రభ వాహనం, స్నపన తిరుమంజనం, రంగురంగు పూలు, కివిపండ్లు, పవిత్రమాలలు !
తిరుమల/తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు శ్రీ గోవిందరాజస్వామి అలంకారంలో దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిసారిగా పటికబెల్లం, కివిపండ్లు, ఎరువు పవిత్రమాలలతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలు, కిరీటాలతో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేదమంత్రాల నడుమ కంకణభట్టార్ శ్రీ వాసుదేవ భట్టాచార్యులు ఈ కార్యక్రమం నిర్వహించారు.
TTD:
బూందీపోటు
ప్రారంభించిన
సీఎం
జగన్,
రోజూ
6
లక్షల
లడ్డూలు,
నిన్న
వైఎస్ఆర్,
నేడు
జగన్
!

తిరుమలలో సూర్యప్రభ వాహనం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు శ్రీ గోవిందరాజస్వామి అలంకారంలో దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు.

ఆయురారోగ్యప్రాప్తి
ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

పటికబెల్లం, కవిపండ్లు, ఎరుపు పవిత్రమాలలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిసారిగా పటికబెల్లం, కివిపండ్లు, ఎరువు పవిత్రమాలలతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలు, కిరీటాలతో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేదమంత్రాల నడుమ కంకణభట్టార్ శ్రీ వాసుదేవ భట్టాచార్యులు ఈ కార్యక్రమం నిర్వహించారు.

రంగురంగుల ఎండుఫలాలు, వట్టివేరు, పసుపు రోజామాలలు
దాదాపు రెండు గంటల పాటు జరిగిన స్నపన తిరుమంజనంలో కురువేరు, తెల్లపట్టు, రంగురంగుల ఎండుఫలాలు, వట్టివేరు, పసుపు రోజామాలలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి అలంకరించారు. వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా అర్చకస్వాములు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు.

శ్రీవారికి, అమ్మవారికి ప్రత్యేక మాలలు
శోభాయమానంగా సాగిన ఈ స్నపన తిరుమంజనాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
తమిళనాడులోని తిరుపూర్ కు చెందిన దాత రాజేందర్ సహకారంతో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక మాలలు, కిరీటాలు, హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్, శ్రీధర్ సహకారంతో రంగనాయకుల మండపం అలంకరణ చేశామని టీటీడీ ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.

శ్రీ పెద్దజియ్యర్ స్వామీజీ, శ్రీ చిన్నజియ్యర్ స్వామీజీ
ఈ
కార్యక్రమంలో
శ్రీశ్రీశ్రీ
పెద్దజీయర్‌స్వామి,
శ్రీశ్రీశ్రీ
చిన్నజీయర్‌స్వామి,
టీటీడీ
ఈవో
డాక్టర్
కెఎస్.జవహర్‌రెడ్డి
దంపతులు,
బోర్డు
సభ్యులు
శ్రీమతి
ప్రశాంతి
రెడ్డి,
అదనపు
ఈవో
ఎవి.ధర్మారెడ్డి
దంపతులు,
సివిఎస్వో
గోపినాధ్
జెట్టి
దంపతులు,
విజివో
బాలిరెడ్డి,
ఆలయ
డెప్యూటీ
ఈవో
రమేష్‌బాబు
ఇతర
అధికారులు
పాల్గొన్నారు.
Recommended Video

హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో !
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుమల నాదనీరాజనం వేదికపై, వసంత మండపంలో ధార్మిక, సంగీత కార్యక్రమాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు బుధవారం జరిగిన కార్యక్రమాలు శ్రీవారి భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలను శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ లో ప్రసారం చేశారు.