TTD: శ్రీవారి సేవ వేళల్లో తాజా మార్పు, లడ్డూ ప్రసాదం పంపిణీపై కీలక ప్రకటన..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులకు వేగంగా దర్శనం.. సేవల విషయంలో టీటీడీ కొత్త మార్పులు తీసుకొస్తోంది. తాజాగా శ్రీవారి ఆలయంలో శ్రీవారి ఆలయంలో ప్రతి మంగళవారం స్వామివారి మూలమూర్తికి నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవా సమయాన్ని మార్చినట్లు ఆలయ ప్రధానార్చకుడు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. కాగా, లడ్డూ ప్రసాదం పంపిణీ పైన భక్తులకు స్పష్టత ఇస్తూ టీటీడీ కీలక ప్రకటన చేసింది.
టీటీడీ భక్తులకు కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రతి మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో.. స్వామివారి మూల మూర్తికి అష్టదళ పాదపద్మారాధన సేవ నిర్వహిస్తారు. ప్రస్తుతం అష్టదళ పాదపద్మారాధన సేవను ఉదయం 9 గంటల నుంచి 9.45 గంటల వరకు నిర్వహిస్తున్నారు. అయితే ఆ సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి 6.45 గంటల వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. నేటి నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. కాగా, గతంలో ఈ సేవ 2022కు ముందు ఉదయం 6 గంటల నుంచి 6.45 గంటల వరకు అమలులో ఉండేది.. కానీ ఆ తర్వాత సమయాన్ని మార్చారు. తాజాగా టీటీడీ ఆగమ సలహామండలి, అధికారుల సూచనలతో పాత సమయానికే అష్టదళ పాదపద్మారాధన సేవను నిర్వహిస్తారు. స్వామివారి సేవలన్నీ వేకుజాము నుంచి ఉదయం వరకు పూర్తి చేస్తే భక్తులకు సాధారణ దర్శనాలు కొనసాగించొచ్చని భావించారు. అందుకే ఈ సమయాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

లడ్డూ సరఫరా... భక్తులకు పంపిణీ పై టీటీడీ క్లారిటీ
ఇక, శ్రీవారి లడ్డూ ప్రసాదం నిల్వలు.. పంపిణీ పైన టీటీడీ స్పష్టత ఇచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి నిల్వలు టిటిడి వద్ద సమృద్ధిగా ఉన్నాయని టిటిడి స్పష్టం చేసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి సరఫరా మూడంచెల కొనుగోలు విధానం ద్వారా జరుగుతోందని వెల్లడించింి. ఒకే సంస్థపై ఆధారపడకుండా మూడు వేర్వేరు సంస్థల ద్వారా నెయ్యి సరఫరా జరుగుతున్నందున ఎలాంటి అనుకోని పరిస్థితులు తలెత్తినా సరఫరాలో అంతరాయం కలగకుండా టిటిడి ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
ఈ క్రమంలో ఇందాపూర్ డైరీ నుండి తిరుమలకు వస్తున్న నెయ్యి ట్యాంకర్ ఇటీవల కడప జిల్లా కొండాపూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఒక సంస్థకు చెందిన ట్యాంకర్ ప్రమాదానికి గురైనంత మాత్రాన నెయ్యి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగలేదని టిటిడి స్పష్టం చేసింది. మిగిలిన రెండు సంస్థల నుండి నెయ్యి సరఫరా యథావిధిగా కొనసాగుతోంది. శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లడ్డూ ప్రసాదాల తయారీ మరియు పంపిణీ పూర్తిస్థాయిలో కొనసాగుతోందని టిటిడి మరోసారి స్పష్టం చేసింది












Click it and Unblock the Notifications