వేసవి రద్దీ వేళ శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ - దర్శనాల్లో ఇక..!!

Tirumala: తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతోంది. ప్రతీ ఎటా వేసవి మూడు నెలలు కొండ పైన రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రద్దీ కారణంగా టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు సదుపాయాలు కల్పిస్తోంది. అదే సమయంలో దర్శనం సమయానికే క్యp లైన్లలోకి భక్తులు రావాలని టీటీడీ సూచిస్తోంది. ఇక, సాధారణ భక్తులకు సులభంగా దర్శనం కలిగించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ కారణంగా మే, జూన్ లో బ్రేక్ దర్శనాల రద్దు పైన వస్తున్న వార్తల వేళ టీటీడీ స్పష్టత ఇచ్చింది.

సిఫారసు లేఖలు రద్దు
భక్తుల రద్దీ వేళ టీటీడీ బ్రేక్ దర్శనాల విషయంలో కొంత సస్పెన్స్ కొనసాగుతోంది. సిఫారసు లేఖలను రద్దు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తిరుమల వెంకేటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల రద్దీ తాకిడి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో వీఐపీ, సిఫారసు లేఖల పై దర్శనాలు రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంటున్నట్లు టీటీడీ బోర్డు సభ్యు డు.. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పినట్లుగా ప్రచారం సాగింది. మే, జూన్ లో రెండు నెలల పాటు కుటుంబా లతో తిరుమలకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్న కారణంగా ఈ నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో, భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మే 1 నుంచి జూన్ 30 వరకు వీఐపీ దర్శనాలతో పాటుగా సిఫారసు లేఖల పై సేవలు.. బ్రేక్ దర్శనాలు.. సుప్రభాతం దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రచారం సాగింది.

ttd-clarifies-over-break-darshan-continuation-in-tirumala

జ్యోతుల నెహ్రూ క్లారిటీ
తిరుమల తిరుపతి స్వామి వారి దర్శనం కోసం ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల సిఫార్సు లెటర్స్ రద్దుపై టీటీడీ పాలకమండలి ఎటువంటి తీర్మానం చేయలేదని స్పష్టం చేశారు. సిఫార్సు లెటర్స్ పై దర్శనాలు యధాతధంగా కొనసాగుతాయని వివరించారు. అయితే, వేసవి కాలంలో రద్దీ ఎక్కు వ గా ఉంటుందని అంచనా వేస్తున్న టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను తగ్గించడానికి, సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించడానికి ఎక్కువ స్థలాన్ని కేటాయించడానికి చర్యలు తీసుకుంటున్నారు. వేసవి రద్దీ వేళ త్వరగా దర్శనం కోసం రెండు నుంచి మూడు నెలల ముందు గానే సిఫారసు లేఖలతో తిరుమల ప్రయాణం ఖరారు చేసుకున్న శ్రీవారి భక్తులకు ఈ స్పష్టత ఉప శమనంగా మారనుంది.

దర్శనాలు యధాతథం..
బోర్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, లేఖలతో యధాతథంగా దర్శనాలు కొనసాగుతాయని నెహ్రూ క్లారిటీ ఇచ్చారు. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ప్రముఖ నటుడు నాని ఆదివారం ఉదయం సుప్రభాత సేవలో స్వామి వారిని దర్శించుకున్నారు. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్రం హెచ్చరికలతో జిల్లా పోలీసు, టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అలిపిరిలో తనిఖీలను కట్టుదిట్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+