ఇక తిరుమల వెళ్లాలంటే, ఇది తప్పనిసరి- అమల్లోకి టీటీడీ కీలక నిర్ణయం..!!
తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలకు భక్తులు అత్యధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీ మేరకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అదే సమయంలో ముందస్తు సూచనలు చేస్తున్నారు. తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం పరిరక్షించేందుకు టీటీడీ తిరుమలలో కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. భక్తులు సహకరించాలని కోరుతోంది.
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్ నేడు కూడా శిలా తోరణం వరకూ కొనసాగుతుంది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు స్వామి వారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుంది. కాగా, ఇదే సమయంలో టీడీటీ తిరుమల ప్రాంతాన్ని 'నో హారన్ జోన్' నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. కొండపై సొంత వాహనాల్లో వచ్చే భక్తులు.. టాక్సీల నిర్వాహకులు హారన్లు, సైరన్లు మోగించడాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ, భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించారు.
గడిచిన ఆరు నెలల కాలంలోనే శబ్ద కాలుష్యానికి కారణమైన 42 వాహనాలపై మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేశారు.

టీటీడీ అధికారుల సూచనలు
కాగా.. వారి నుంచి రూ.64,475 జరిమానా వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తిరుమలలోని జీఎన్‌సీ టోల్‌గేట్ నుంచి రెండు ఘాట్ రోడ్లతో సహా కొండపై అన్ని ప్రాంతాల్లో ఈ నిబంధన వర్తిస్తుంది. ఎప్పటి నుంచో ఈ రూల్ అమల్లో ఉన్నప్పటికీ, చాలామంది వాహనదారులు దీన్ని పట్టించుకోకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీవ్రతరం చేశారు. ఇందు కోసం తిరుమల వ్యాప్తంగా రెండు వేలకుపైగా సీసీ కెమెరాల ద్వారా పోలీస్ కమాండ్ కంట్రోల్ విభాగం నిరంతరం పర్యవేక్షిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు, వీవీఐపీ ప్రోటోకాల్ వాహనాలు మాత్రమే సైరన్ ఉపయోగించు కునేందుకు పరిమితమైన వెసులుబాటు కల్పించారు.












Click it and Unblock the Notifications