వైకుంఠ ద్వార దర్శనాల వేళ.. టోకెన్ లేని భ‌క్తులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. భక్తుల గోవిందనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. శ్రీ‌వారి ద‌ర్శ‌నానంత‌రం భ‌క్తులు వైకుంఠ ద్వార ప్ర‌వేశం చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 12.05 నిమిషాలకు వైకుంఠ ద్వారాలు తెరిచారు. అనంత‌రం అర్చ‌కులు స్వామివారికి నిత్య‌ కైంక‌ర్యాలు నిర్వహించి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు ప్రారంభించారు.

టోకెన్ లేని భ‌క్తులు జ‌న‌వ‌రి 2 నుండి 8వ తేది వ‌ర‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు చేసుకోవ‌చ్చ‌ు. దాదాపు 3500 మంది పోలీసు, విజిలెన్స్ సిబ్బందితో ప‌గ‌డ్భందీ ప్ర‌ణాళిక‌ల‌తో భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. ఏఐ కమాండ్ కంట్రోల్ సెంట‌ర్ ద్వారా నిరంత‌రం భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షిస్తూ ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా సిబ్బంది చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. తొలిమూడు రోజుల పాటు టోకెన్ క‌లిగిన భ‌క్తులు నిర్దేశిత టైమ్ స్లాట్ ప్ర‌కారం ద‌ర్శ‌న క్యూలైన్ల‌కు వ‌చ్చి స్వామివారిని ద‌ర్శించుకోవాల‌ని టీటీడీ ఈఓ సూచించారు.

TTD EO Announces Token-Free Vaikuntha Dwara Darshan via Sarva Darshan from Jan 2 to Jan 8

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగ‌ళ‌వారం తిరుమలలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 9 నుండి 10:30 గంటల మధ్య శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. ఇందులో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు.

వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ తెల్లవారు జామున 4:30 నుండి 5:30 గంటల మధ్య శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నానమాచరించిన వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందన్నది ప్రాశస్త్యం. వైకుంఠ ద్వాదశి నాడు కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది.

ఈ సందర్భంగా తిరుమలలోని శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, నరేష్, శాంతారాం, జానకి దేవి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి చేసుకుని వెలుపలకు వచ్చిన భక్తులతో మాట్లాడి టీటీడీ కల్పించిన సౌకర్యాలు, సదుపాయాలపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్ల పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారని బీఆర్ నాయుడు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+